సైబ‌ర్ నేర‌గాళ్లలో ఆ స్టేట్ వాళ్లే ఎక్కువ ఉన్నారంట‌..

సాకేతికత.మానవుడి మేథస్సుకు నిదర్శనం.

ఏటేటా సాంకేతికతంగా విప్లవాత్మకమైన మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటుంటే.మరోవైపు అదే సాంకేతికతతో చెడు మార్గాల్లో పయణించి నేరాలకు పాల్పడే వారు నానాటికి పెరిగిపోతున్నారు.

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసం చేస్తూ జనాల సొమ్మును కాజేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

సైబర్ మోసాలకు పాల్పడుతున్న దాదాపు 300మందిని ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పట్టుబడిన వారిలో అత్యధికంగా రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.ఇందులో హైదరాబాద్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు కేవలం 86 మంది ఉన్నారు.

సైబర్ నేరగాళ్లు రెండు రకాలుగా ప్రజలను మోసం చేస్తుంటారు.మొదటిది ఆర్థికపరంగా, రెండోది సోషల్ మీడియాను ఉపయోగించి ఇబ్బందులకు గురిచేయడం.

ఆర్థికపరంగా అంటే టార్గెట్ చేసిన వ్యక్తులకు మెసేజ్, మెయిల్స్, కాల్స్ చేసి మీకు లాటరీ తగిలింది.

కొంత నగదు వెంటనే కట్టాలి అంటూ బురిడీ కొట్టించి అకౌంట్‌లోని నగదును కాజేస్తుంటారు.

ఇక రెండో పద్దతితో సోషల్ మీడియాను ఉపయోగించి వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయడం.టార్గెట్ చేసిన వ్యక్తుల సెల్‌ఫోన్, ఫేస్‌బుక్, హ్యాక్ చేసి వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం.

తద్వారా డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేస్తామని బెదిరించి వసూళ్లకు పాల్పడడం.

ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది ఈ కోవకు చెందిన వారే.

"""/"/ టార్గెట్ చేసిన వ్యక్తుల కంప్యూటర్, ఫోన్ ఉపయోగించి వారి డేటాను అపహరించి ఇలా చేస్తారు.

ఈ నేరాలకు పాల్పడే వారిలో ఎక్కువ మంది చదువుకున్న వారే కావడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వ్యక్తులకు తక్కువకే ఖరీదైన వస్తువులను అమ్ముతూ కుచ్చుటోపీ పెడుతున్నారు.

అలాగే ఫేస్ బుక్ లో ఉండే ఖాతాల మాదిరి నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి అందులో ఉండే వారికి అర్జెంట్‌గా డబ్బులు కావాలని మెసేజ్‌లు పెడుతున్నారు.

అలాగే ఇతర దేశాలకు చెందిన వారు కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఈ రకం దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. బతికున్న నల్లత్రాచుకు నేరుగా పూజలు చేస్తున్న కుటుంబం..