ఈ గుడికి ఒక్కసారి వెళితే తలరాతలు మారిపోతాయట.. కోరుకున్న ప్రతి కోరిక తీరుతుందంటూ?

మనలో చాలామంది గుడి( Temple )కి వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత లభించడంతో పాటు కష్టాలు తీరతాయని భావిస్తారు.

వారానికి ఒకసారైనా గుడికి వెళ్లడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది.అయితే బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.

రాజస్థాన్ రాష్ట్రంలోని బ్రహ్మ ఆలయానికి వెళ్లడం ద్వారా తలరాతలు మారిపోతాయని పండితులు చెబుతున్నారు.

"""/" / జగత్పిత బ్రహ్మ మందిర్ ( Jagatpita Brahma Mandir )అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు.

ఈ ఆలయంలో నాలుగు ముఖాల బ్రహ్మను దర్శించుకోవచ్చు.ఈ ఆలయం 2000 సంవత్సరాల కంటే పురాతనమైన ఆలయం కాగా కార్తీక పూర్ణిమ( Kartika Purnima ) రోజున ఈ గుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది.

పుష్కర్ సరస్సులో స్నానం చేసి బ్రహ్మదేవుని ఆలయాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుంది.జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

"""/" / బ్రహ్మదేవుడు( Lord Brahma ) తన ఆయుధమైన తామరపువ్వుతో వజ్రనప అనే రాక్షసుడిని సంహరించగా మూడు ప్రదేశాలలో తామర రేకులు పడడం వల్ల మూడు సరస్సులు ఏర్పడ్డాయట.

ఆ సమయంలో బ్రహ్మ దేవుడు ప్రధాన పుష్కర్ సరస్సు దగ్గర యజ్ఞం చేసి యజ్ఞం కోసం చుట్టూ కొండలను సృష్టించడం జరిగింది.

వివాహం అయిన వాళ్లు ఈ ఆలయంలో గర్భగుడిలోకి వెళ్లడానికి అర్హులు కాదు.మధ్యాహ్నం 1 : 30 నుండి 3 : 00 గంటల మధ్య ఈ ఆలయాన్ని మూసివేస్తారు.

బస్సు, రైలు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి ఉంటాయి.అజ్మీర్ జిల్లాలో సముద్రమట్టానికి 510 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది.

విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల పాటు యజ్ఞం చేశాడని తెలుస్తోంది.

మన దేశంలో ఉన్న తీర్థాలలో అతి పవిత్రమైనది పుష్కర్ తీర్థమేనని చాలామంది భావిస్తారు.

ఈ బాలిక తెలివి అదుర్స్.. ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..