వీడియో: భార్య కోసం ఉద్యోగానికి రాజీనామా.. అదే రోజు ఆమె మృతి చెందడంతో?
TeluguStop.com
రాజస్థాన్‌లోని( Rajasthan ) కోటాలో జరిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేర్‌వెల్ సెలబ్రేషన్స్ పార్టీ విషాదంగా ముగిసింది.
తన భార్య ఆరోగ్యం కోసం ముందస్తు పదవీ విరమణ చేసిన ఆ ఉద్యోగి కళ్ల ముందే ఆమె తుదిశ్వాస విడిచింది.
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, దేవేంద్ర సాండల్( Devendra Sandal ) అనే వ్యక్తి సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో( Central Warehousing Corporation ) మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
తన భార్య టీనా( Tina ) చాలా కాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో, ఆమెను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశంతో మూడేళ్లు ముందుగానే పదవీ విరమణ( Retirement ) చేయాలని నిర్ణయించుకున్నారు.
అతని లాస్ట్ వర్కింగ్ డే సందర్భంగా సహోద్యోగులు ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు.
ఈ వేడుక నవ్వులు, ఆనందంతో ప్రారంభమైంది.దేవేంద్ర, టీనాలకు పూలమాలలు వేసి సత్కరించారు.
గులాబీ రేకులతో అలంకరించిన టేబుల్ వారి ముందు శోభాయమానంగా ఉంది.అంతా సంతోషంగా గడుపుతున్నారు.
"""/" /
అలా అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా టీనా "తల తిరుగుతోంది" అని అనడంతో వేడుకలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది.
భార్య పరిస్థితిని గమనించిన దేవేంద్ర వెంటనే ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి వీపు మర్దన చేయడం మొదలుపెట్టారు.
చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే నీళ్లు తెచ్చారు.కానీ, క్షణాల్లోనే ఆమె పరిస్థితి విషమించడంతో అక్కడే కుప్పకూలిపోయింది.
"""/" /
వైరల్ వీడియోలో( Viral Video ) చూసినట్లు మొదట ఫొటోల కోసం ఎవరో నవ్వమని ప్రోత్సహించడంతో టీనా నవ్వడానికి ప్రయత్నించింది.
ఆ తర్వాత చూస్తుండగానే టేబుల్‌పై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.దేవేంద్ర, అక్కడున్న వాళ్లు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి పరిగెత్తారు.
మళ్లీ మళ్లీ నీళ్లు తెమ్మని అడిగారు, కానీ టీనా పరిస్థితి క్షణాల్లో మరింత విషమించింది.
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.కానీ, దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ అన్యోన్య దంపతుల జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకాల్సిన ఈ ఫేర్‌వెల్ వేడుక హృదయవిదారక విషాదంగా ముగిసింది.
ఆ ఘటన అక్కడున్న వారందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్