కష్టపడి పని చేసే కూలీలకు కలిసి వచ్చిన అదృష్టం...

మనదేశంలో గుప్త నిధుల కోసం వెతికే వారు చాలామంది ఉంటారు.వీటికోసం కొంత మంది క్షుద్ర పూజలు కూడా చేస్తూ ఉంటారు.

ఇటువంటి పనులన్నీ కేవలం బంగారం కోసమే చేస్తూ ఉంటారు.అలా చేస్తే గుప్త నిధులు వారి సొంతం అవుతాయని కొందరు స్వామీజీ చెప్పిన మాటలను కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు.

కానీ కొందరికి అనుకోకుండా గుప్త నిధులు దొరుకుతూ ఉంటాయి.కొందరు కష్టపడే కూలీలు నిర్మాణ స్థలాలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఏవో మెరుస్తున్న నాణేలు కనిపించాయి.

దీంతో వారు చాలా సంతోషపడి తమకు అదృష్టం కలిసి వచ్చి ఈ నాణాలు దొరికాయని సంబరాలు చేసుకున్నారు.

కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.ఎందుకంటే ఈ విషయం అందరి నోటా మాట్లాడడం వల్ల సమాచారం అందుకున్న అధికారులు వెంటనే నాణేలు దొరికిన ప్రదేశానికి వచ్చి 50 నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

జైపూర్‌ కు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న జామ్వా రామ్‌గఢ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

అయితే, ఈ నాణేలు ఎలా ఉన్నాయో ఆ దొరికిన కూలీలకు తప్ప ఎవరికీ తెలియదు.

ఇవి ఏ కాలం నాటివో అనే వివరాలు వివరించలేదు. """/" / పాత నాణేల రికవరీ గురించి గ్రామస్తుల నుండి మాకు గురువారం సమాచారం అందడం వల్ల వెంటనే వారిని అదుపులోకి తీసుకుని రాష్ట్ర పురావస్తు శాఖకు సమాచారం అందించాం.

జైపూర్ అధికారులు వచ్చి 50 నాణేల ను స్వాధీనం చేసుకున్నారు.వాటిని ఖజానాలో భద్రంగా ఉంచుతాం అని స్థానిక తహసీల్దార్ రాకేష్ మీనా చెప్పారు.

కాగా గ్రామంలో పురాతన నిధులు దొరకడం ఇదే మొదటిసారి మాత్రం కాదు.ఈ సంవత్సరం మొదట్లో ఉపాధి హామి పనులు చేస్తున్న కార్మికులకు మట్టికుండ లో దాచి ఉంచిన 82 నాణేలు దొరికాయి.

రాజబాబుది ఇంత మంచి మనస్తత్వమా.. ఈ ఒక్క సంఘటనే నిదర్శనం..?