వీడు ప్రిన్సిపల్ కాదు కామ రాక్షసుడు.. ఉరిశిక్ష కూడా తక్కువే..!

ఉపాధ్యాయుడు అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తి.విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం, మానవత్వం లాంటివి నేర్పించే వారిని గురువులు అంటారు.

అందుకే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను దైవంతో సమానంగా భావిస్తారు.అయితే కొందరు ఉపాధ్యాయులు తమ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు.

ఇలాంటి నీచులను చూసి ఉపాధ్యాయులంతా తలదించుకోవాల్సి వస్తుంది.ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ ( Principal ) ఏకంగా ఆరుగురు మైనర్ బాలికలను అత్యాచారం చేశాడు.

చివరికి జైలు పాలయ్యాడు. """/" / వివరాల్లోకెళితే.

రాజస్థాన్ లోని( Rajasthan ) దుంగార్ పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రమేష్ చంద్రకటారా( Ramesh Chandrakatara ) అనే వ్యక్తి ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

రమేష్ నీలి చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డాడు.ఆ తర్వాత మైనర్ బాలికను లొంగదీసుకుని, బెదిరించి అత్యాచారానికి పాల్పడేవాడు.

ఇలా ఒకరి తరువాత ఒకరుగా ఏకంగా ఆరుగురు మైనర్ విద్యార్థులపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

రమేష్ కు రెండు సొంత ఇల్లు ఉన్నాయి.అందులో ఒకటి ఇంకా నిర్మాణంలో ఉంది.

ఈ మైనర్ బాలికలను బెదిరించి నిర్మాణంలో ఉన్న ఇంటికి తీసుకువెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడేవాడు.

"""/" / అయితే ఓ 12 ఏళ్ల బాలిక ధైర్యం చేసి తన తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల విచారణలో ప్రిన్సిపల్ వేసవి సెలవులు కావడంతో పిల్లలను పాఠశాలకు పిలిచి, తన కారులో నిర్మాణంలో ఉండే ఇంటికి తీసుకువెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడేవాడని తేలింది.

ఈ ప్రిన్సిపల్ ఏకంగా 6 మంది బాలికలపై అత్యాచారం చేసినట్లు తేలింది.ఇక ఇతని వద్ద ఉండే రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్కూల్ నుండి పిల్లలను ఇంటికి తీసుకువెళ్లే స్కార్పియో వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు.

రమేష్ పై పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్టు చేశారు.

ఫ్యాన్స్ తో పాటు రక్తదానం చేసి మంచి మనస్సు చాటుకున్న సూర్య.. గ్రేట్ అంటూ?