రాజాసింగ్ కి ప్రాణహాని ఉంది విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!!

గత నెలలో ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆయన చేసిన వ్యాఖ్యలు హైదరాబాదులో పెను దుమారాన్ని రేపాయి.అయితే పాత కేసులు నేపథ్యంలో ఆయన అరెస్టు కావటం.

నెల రోజులకు పైగా జైల్లోనే ఉంటూ ఉన్నారు.ఈ క్రమంలో జైల్లో ఉన్న రాజాసింగ్ కి ప్రాణహాని ఉందని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

నెల రోజులుగా జైల్లో ఉన్న రాజాసింగ్.ఎమ్మెల్యే అని ఈ ప్రభుత్వం గుర్తించకపోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.

జైల్లో ఉన్న ఎమ్మెల్యే నీ నియోజకవర్గ ఓటర్లు.ప్రజలు కలవడానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం హక్కులను కాలరాయటమే అంటూ విజయశాంతి సీరియస్ అయ్యారు.

రాజాసింగ్ నీ విడుదల చేయాలని ఇక్కడి వారు మాత్రమే కాదు మహారాష్ట్రకు చెందిన వాళ్లు కూడా ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు.

వెంటనే ఆయన విడుదల చేయాలని విజయశాంతి డిమాండ్ చేయడం జరిగింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్20, శుక్రవారం 2024