మా ఇంట్లో నా మాటే జీవిత వింటుంది.. డైలాగ్ పై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

నితిన్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Nitin , Extraordinary Man )ట్రైలర్ చివర్లో రాజశేఖర్ జీవిత, జీవితం ఒకటే అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై అంచనాలు పెరగడానికి రాజశేఖర్ రోల్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

జీవిత రాజశేఖర్ ( Jeevitha Rajasekhar )జోడీ టాలీవుడ్ బెస్ట్ జోడీలలో ఒకటి కాగా రాజశేఖర్ ఫ్యామిలీలో జీవిత నిర్ణయమే ఫైనల్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

అయితే ఈ సినిమా ఈవెంట్ లో రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. """/" / జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ ను డైరెక్టర్ వక్కంతం వంశీ ( Director Vakkantham Vamsi )ఎలా రాశారో తెలియదని ఆ డైలాగ్ బాగా సక్సెస్ అయిందని రాజశేఖర్ అన్నారు.

వాస్తవానికి నేను చెప్పిందే జీవిత వింటుందని జీవిత చాలా మంచిదని ఒక్క మాట కూడా తిరిగి అనదని రాజశేఖర్ కామెంట్లు చేశారు.

కానీ అందరూ జీవిత ఎలా చెబితే నేను అలా ఆడతానని అనుకుంటారని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

"""/" / జీవిత చెప్పింది కూడా నేను వింటానని ఆమె చెప్పేది నా మంచి కోసమే అని రాజశేఖర్ వెల్లడించారు.

ఆ తర్వాత జీవిత మాట్లాడుతూ భార్యాభర్తలు అంటే ఒకరి మాట ఒకరు వినాలని ఆయన అన్నారు.

ఒకరి గురించి ఇంకొకరు బ్రతకాలని అలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రమే పెళ్లి చేసుకోవాలని జీవిత కామెంట్లు చేశారు.

మేమిద్దరం ఒకరి కోసం మరొకరు బ్రతుకుతున్నామని జీవిత అన్నారు.నాకు, నా భర్త కూతుళ్లు మాత్రమే ప్రపంచం అని జీవిత కామెంట్లు చేశారు.

వీళ్ల కోసం ఎవరినైనా ఎదురిస్తానని మంచి పాత్ర దొరికితే రాజశేఖర్ విలన్ గా చేస్తారని, రాజశేఖర్ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారని జీవిత చెప్పుకొచ్చారు.

జీవిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

రేణు దేశాయ్ ఇంట్లో ప్రత్యేక పూజలు… సంతోషం వ్యక్తం చేసిన నటి!