కల్కితో కాసుల కక్కుర్తి పడుతున్న నిర్మాత! ముందుకు రాణి బయ్యర్లు

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా తీజర్ కొత్తగా ఉండటంతో మరల ఒకప్పటి రాజశేఖర్ ని ప్రేక్షకులకి పరిచయం చేసింది.

దీంతో సినిమా మీద అంచనాలు భారీగానే ఏర్పాడ్డాయి.అయితే ఈ అంచనాలు ఉపయోగించుకొని సినిమాని ఎక్కువ రేటుకి అమ్మేసి రిలీజ్ కి ముందే పెట్టుబడి సంపాదించుకోవాలని నిర్మాత కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే దానికి బయ్యర్ల నుంచి ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగులుతుంది అని సమాచారం.

ఏరియా వైజ్ డీల్స్ విషయంలో పెద్ద మొత్తాల్ని నిర్మాత కళ్యాణ్ డిమాండ్ చేయడంతో బయ్యర్లు పంపిణీదారులు సినిమాని కొనేందుకు వెనకాడుతున్నారన్న చర్చా బయట జరుగుతోంది.

రాజశేఖర్ మార్కెట్ పరిధి ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా తక్కువగా ఉంది.గతంలో గరుడ వేగ సినిమాకి నిర్మాత భారీగా పెట్టుబడి పెట్టి నష్టపోయాడు.

అ సినిమా వలన బయ్యర్లు కూడా దెబ్బ తిన్నారు.ఈ నేపధ్యంలో రాజశేఖర్ సినిమా మీద ఎక్కువ పెట్టి నష్టపోకుండా ఉండాలని మార్కెట్ వర్గాలు ప్రణాళికా బద్ధంగానే వెళుతున్నాయి.

దీంతో ఇప్పటివరకూ కొన్ని ఏరియాల బిజినెస్ తెగలేదని తెలుస్తోంది.

గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు దంతాలను తెల్లగా కూడా మెరిపిస్తుంది.. ఎలా వాడాలంటే?