కరోనా దెబ్బకు జడుసుకున్న యాంగ్రీ స్టార్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్ చిత్రాలతో కొనసాగిస్తున్నాడు.ఇప్పటికే గరుడవేగ, కల్కి వంటి సినిమాలతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న రాజశేఖర్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.

అయితే 2011లో రాజశేఖర్ నటించిన ఓ సినిమా ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది.

తమిళ దర్శకుడు కన్మణి డైరెక్షన్‌లో వస్తున్న అర్జునా అనే సినిమాను మార్చి 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

అయితే ఇన్నేళ్లుగా రిలీజ్‌కు నోచుకోని ఈ సినిమా ఇప్పుడు కూడా రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా పలు తెలుగు సినిమాలు తమ రిలీజ్‌ను వాయిదా వేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో రాజశేఖర్ అర్జునా సినిమాను కూడా వాయిదా వేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.

ఇక పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక అర్జునా సినిమాను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

నదియాతో ప్రేమాయణం గురించి బయటపెట్టిన సీనియర్ నటుడు సురేష్.. ఏం జరిగిందంటే?