స్టేజి మీద తొందరపడ్డ రాజశేఖర్.. అలాంటివి చెప్పొద్దు అంటూ వారించిన జీవిత?

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన వారసురాలుగా ఇండస్ట్రీలోకి శివానీ, శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

తాజాగా శివాని హీరోయిన్గా గుహన్ దర్శకత్వంలో అదిత్, శివాని హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం WWW.

ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోనే ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇదిలా ఉండగా ఈ వేడుకలో భాగంగా రాజశేఖర్ వేదికపై తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతున్న సమయంలో జీవిత అలాంటివి మాట్లాడకూడదని తనని వారించింది.

రాజశేఖర్ వేదికపైకి వెళ్లి సినిమా గురించి చాలా చక్కగా మాట్లాడుతూ అనంతరం కరోనా గురించి మాట్లాడారు.

కరోనా గురించి మాట్లాడుతున్న సమయంలో జీవిత అలాంటివి మాట్లాడకూడదని చెప్పగా రాజశేఖర్ మాత్రం నన్ను చెప్ప నివ్వు అంటూ అసలు విషయం చెప్పబోతుండగా వెంటనే శివాని ఆ విషయం మొత్తం బయట పెట్టారు.

"""/" / ఈ సినిమా షూటింగ్ సమయంలో శివాని కరోనా బారిన పడిందని రాజశేఖర్ చెప్పిన తర్వాత శివాని మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను కరోనా బారిన పడ్డాను.

నా నుంచి నాన్నకు కరోనా వచ్చింది అంటూ అప్పుడు బాగా ఏడ్చిందని ఇలా అందరినీ ఈ సినిమా ఎంతో బాధ పెట్టినప్పటికీ ఇదొక మంచి మెమరబుల్ గాఎప్పటికీ మా జీవితంలో గుర్తుండి పోతుందని అనంతరం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ తమ వ్యక్తిగత విషయాలు గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు.

కొడుకులతో ఆటోలో ప్రయాణం చేస్తూ చిల్ అవుతున్న నయనతార.. వీడియో వైరల్!