రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివాహిత దారుణ హత్య.. పరారైన హంతకుడు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని జాతర గ్రౌండ్ లో ఉండే ఓ ప్రైవేట్ లాడ్జిలో సద్గుల వెంకటవ్వ( Sadgula Venkatavva ) (46) అనే వివాహిత ఆదివారం దారుణ హత్యకు గురైంది.

లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న వేములవాడ టౌన్ సీఐ కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకెళితే.ఎల్లారెడ్డి మండలం వెంకటాపురం( Venkatapuram ) గ్రామానికి చెందిన వెంకటవ్వకు, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉండే చంద్రంపేటకు చెందిన రాములు అనే వ్యక్తితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.అయితే వెంకటవ్వ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిందని భర్త రాములు పోలీసులకు తెలిపాడు.

మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి, భర్త రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

"""/" / పోలీసులు ప్రాథమిక విచారణ చేయగా.వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో శనివారం అర్ధరాత్రి వెంకటవ్వ పేరుతో రూమ్ బుక్ చేసుకున్నారు.

ఆ రూమ్ లో వెంకటవ్వ తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు లాడ్జి యజమాని పోలీసులకు తెలిపాడు.

శనివారం అర్ధరాత్రి సదరు వ్యక్తి లాడ్జిలో నుండి బయటకు వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ లలో రికార్డ్ అయింది.

"""/" / లాడ్జ్ యజమాని ఆధార్ కార్డ్( Aadhaar Card ) ఇవ్వాలని కోరడంతో తీసుకువస్తానని చెప్పి బయటకు వెళ్లిన సదరు వ్యక్తి తిరిగి రాలేదు.

ఆదివారం సాయంత్రం లాడ్జి యజమాని వెంకటవ్వ అద్దెకు తీసుకున్న గది ను పరిశీలించగా.

ఆమె బెడ్ పై విగతజీవి గా పడి ఉంది.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు లాడ్జికి చేరుకొని విచారణ చేపట్టారు.

హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వెంకీ అట్లూరి ఇక తెలుగు హీరోలతో సినిమాలు చేయాడా..?