అక్రమంగా తరలిస్తున్న 20 క్విటాళ్ల పిడిఎస్ రైస్ ను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శనివారం టాస్క్ ఫోర్స్ ఎస్.
ఐ మారుతి తన సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు కొనరావుపేట్ మండలం కొండాపూర్ గ్రామం నుండి సిరిసిల్ల లోని లక్ష్మీ ఇండస్ట్రీస్ కి గుంట సంయోల్ S/o కొమురయ్య,20 క్విటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం ను టి ఎస్ 01 యు బి 4798 అను నెంబర్ గలా ట్రాలీ ఆటో లో తరలిస్తుండగా సిరిసిల్ల లోని రగుడు చౌరస్తా వద్ద వారిని పట్టుకొని ఆటోలు,
రేషన్ బియ్యం ను స్వాధీన పరుచుకొని వారిని అదుపులోకి తీసుకోని తదుపరి చర్యల నిమిత్తం వారిని మరియు ఆటోలను, పి డి ఎస్ రైస్ ను సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది.
ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఎస్.ఐ లు మాట్లాడుతూ పేదలకు అందవలసిన ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇట్టి టాస్క్ లో టాస్క్ఫోర్స్ ఎస్.ఐ లు మారుతి,శ్రీకాంత్, రాజేష్, తిరుపతి,మహిపాల్,శ్రీనివాస్,మహిపాల్, అక్షర్,సమీయెద్దీన్, పాల్గొన్నారు.
ఈ పవర్ ఫుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!