ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కి ఎంపికైన రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన డి.చంద్రయ్య 1991 సంవత్సరంలో ఎస్.

ఐ గా పోలీస్ శాఖలో చేరి శిక్షణ అనంతరం ఎస్.ఐ తొలిసారిగా కొత్తగూడ పోలీస్ స్టేషన్ వరంగల్ లో భాధ్యతలు చేపట్టి, వరంగల్ లో పలు పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించారు.

అనంతరం 2007 సంవత్సరంలో ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి ఇన్స్పెక్టర్ గా వరంగల్, ఆదిలాబాద్,ఖమ్మం జిల్లాలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పని చేసారు.

2017 సంవత్సరం లో డిఎస్పీ గా పదవి బాధ్యతలు స్వీకరించి రామగుండం కమిషనరేట్ లో క్రైమ్ ఏ సి పి గా,హన్మకొండ, సైబరాబాద్ లలో ఏసీపీ క్యాడర్ లో ముఖ్య బ్యాధ్యతలు అందించారు.

అనంతరం కరీంనగర్ పోలీస్ ట్రేనింగ్ కళాశాలలో పని చేసారు.అదే సమయంలో 2021 సంవత్సరంలో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించి గత రెండు సంవత్సరాలు గా జిల్లాలో విధులు నిరహిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను సేవ పథకం, ఉత్తమ సేవ పథకాలతో అందించడం జరిగింది.

34 సంవత్సరాల సుదీర్ఘ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ కి గణతంత్ర వేడుకలను పురస్కరించుకోని ఎంపిక చేసింది.

ఓరినాయనో, ఒక్క సంవత్సరంలోనే రూ.367 కోట్లు సంపాదించిన అడల్ట్ స్టార్.. ఈమె స్టోరీ వింటే..?