మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోవద్దు – ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సైబర్ నేరాల పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారని, జిల్లా ప్రజలు ఇలాంటి అన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

గుర్తు తెలియని నెంబర్ నుండి వచ్చే లింక్స్, మెసేజ్ లు ఓపెన్ చేయవద్దని, మన ప్రమేయం లేకుండా న మొబైల్స్ కి వచ్చే ఓటీపీ లను ఎవరికి షేర్ చేయవద్దని,లోన్ యాప్ అంటూ సులభంగా లోన్ లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ మీ యొక్క డేటా మొత్తం తమ అధీనం లోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కాబట్టి ఎవరు అలాంటి యాప్ లను డౌన్లోడ్ చేయకూడదు అని, ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటెనే హెల్ప్ లైన్ నంబర్ 1930 ,డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయగలరని అన్నారు.

22 జనవరి 2024 మరియు ఆ తర్వాత మన యొక్క మొబైల్ ఫోన్ లోకి వాట్సప్ ద్వారా గాని లేక టెక్స్ట్ మెసేజ్ ద్వారా గాని అయోధ్య రామాలయం సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ లేదా లైవ్ ఫొటోస్ సంబంధించిన లింక్ వచ్చే అవకాశం ఉన్నది ఇటువంటి లింక్స్ ని దయచేసి ఓపెన్ చేయవద్దు.

ఈ లింక్స్ ని సైబర్ క్రిమినల్స్ క్రియేట్ చేయడం జరిగింది.ఈ లింక్స్ ఓపెన్ చేయడం వల్ల మన మొబైల్ హ్యాక్ అయి మన బ్యాంక్ అకౌంట్ లో నుంచి డబ్బులు పోయే ప్రమాదం ఉంది దయచేసి అందరూ గమనించగలరు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.

● సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి ఇండస్ట్రియన్ ల్యాండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ కస్టమర్ కేర్ నుండి అని చెప్పి భారతీయుడు యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్డేట్ చేస్తామని చెప్పగా బాధితుడు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మరియు ఓటిపి షేర్ చేసుకోవడం ద్వారా బాధితుడు 94000 నష్టపోయాడు.

● సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి ఒక గుర్తు తెలియని నెంబర్ నుండి కాల్ రావడం జరిగింది.

కాల్ చేసిన అతను ఇండియా బుల్స్ పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ గా చెప్పుకొని బాధితుడికి లక్ష రూపాయల లోన్ మంజూరు అయినది దాని యొక్క ప్రాసెసింగ్ ఫీస్ మరియు సంబంధిత చార్జెస్ అని చెప్పి బాధితులు దగ్గర నుండి 13 వేల రూపాయలు తీసుకున్నాడు కానీ తర్వాత బాధితుడు అవి ఫేక్ అని తెలుసుకొని బాధితులు 13 వేల రూపాయలు నష్టపోయాడు.

● సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి బ్యాంక్ సంబంధించిన అధికారిగా చెప్పుకున్న ఒక వ్యక్తి కాల్ చేసి బాధ్యత యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పగా బాధితులతో పంపించిన లింకులోని ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది.

దీని ద్వారా బాధితుడు 1,35,000/- నష్టపోయారు.● ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఒక ప్రైవేట్ కొరియర్ సర్వీస్ నెంబర్ కోసమని గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది కానీ ఆ నెంబర్ ఒక రాట్ స్టార్ ది ఆ నెంబర్కు బాధితులు కాల్ చేయడం ద్వారా బాధ్యతని అతడు ప్రాసెసింగ్ ఫ్రీ అని చెప్పి దగ్గర నుండి 5000 రూపాయలు వసూలు చేశాడు కానీ తర్వాత బాధితులు తెలుసుకున్నాడు అతను దీని ద్వారా 5000 రూపాయలు నష్టపోయాడు.

H3 Class=subheader-styleతీసుకోవలసిన జాగ్రత్తలు:-/h3p • మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.

ఆశపడకండి, అనుమానించండి.• లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి.

మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.

• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.

• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.

ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

• సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.

• మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి.అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.

ప్రవాసీ భారతీయ దివస్ 2025కు ముఖ్య అతిథి ఎవరంటే?