ఫిబ్రవరిలో జిల్లాలో వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాలీబాల్ ఛాంపియన్ షిప్ -2024 అనే పేరుతో యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు మహిళలకు, పురుషులకు వేరు వేరుగా నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని జిల్లా యువజన, క్రీడాధికారి అజ్మీరా రాందాస్ తెలిపారు.

శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ చాంపియన్ షిప్ -2024 పోస్టర్ ను జిల్లా యువజన,క్రీడాధికారి అజ్మీరా రాందాస్, జిల్లా పౌరసంబంధాల అధికారి మామిండ్ల దశరథం , సీనియర్ సహాయకులు వెంకటేశ్ తో కలిసి ఆవిష్కరించారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారి ఆదేశాల మేరకు ఇట్టి వాలీబాల్ ఛాంపియన్ షిప్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన,క్రీడాధికారి అజ్మీరా రాందాస్ తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఆసక్తి గల యువతీ, యువకులు తమ జట్ల వివరాలను సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని రెండవ అంతస్తు లో గల యువజన, క్రీడా శాఖ అధికారి కార్యాలయంలో తేదీ 05-02-2024 లోగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఒక్కో టీమ్ కు ఎంట్రీ ఫీజు 1,000 రూపాయలు మాత్రమే అని తెలిపారు.

జిల్లా కేంద్రం సిరిసిల్ల పట్టణంలోని మినీ స్టేడియంలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన మహిళలు, పురుషుల జట్లకు క్యాష్ ప్రైజ్ తో పాటు క్రీడా ట్రోఫీ ని విజేతలకు కలెక్టర్, ఎస్పీ ల చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు.

ఫిబ్రవరి లో పోటీలు నిర్వహించే తేదీలను, క్యాష్ ఫ్రైజ్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

జట్ల వివరాలను నమోదు చేసుకునేందుకు 9440239783, 9059465889, 7569207411 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

తొలి సినిమాతోనే మోక్షజ్ఞకు ఊహించని సవాళ్లు.. వాటిని అధిగమించడం సులువు కాదుగా!