వ్యవసాయ బిల్లు కోసం రంగంలోకి రాజ్ నాథ్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఇది రైతుల శ్రేయస్సు కోసమే ప్రవేశపెట్టామని ఒకపక్క కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే ఇది రైతులకు కీడు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఇక ఈ ప్రచారం ఎక్కువ అవ్వడంతో ఎక్కడ తమ ఉనికికి ప్రమాదం వస్తుందని బీజేపీ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా అధికార పార్టీకి దూరం అవుతూ వస్తున్నాయి.

దీన్ని నిలువరించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.రానున్న కాలంలో బిజేపి మరిన్ని సంస్కరణలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది సరిగ్గా ఇలాంటి టైంలో వారికి మిత్రపక్షాలు దూరం అవుతుండడం బీజేపీ వర్గాలలో కలకలం రేపుతోంది.

అందుకే వెంటనే బీజేపీ నాయకులు క్రైసిస్ మేనేజర్ గా పేరున్న రాజ్‌నాథ్ సింగ్ ను బిజేపి మిత్రపక్షాలు మరియు ఇతర ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని రంగంలోకి దించినట్లు సమాచారం.

ప్రస్తుతం లోక్ సభలో భారీ మెజారిటీ ఉన్న బీజేపీ రాజ్యసభలో మెజారిటీ లేదు.

అందుకే తమ నుండి వరుసగా వైదొలుగుతున్న మిత్రపక్షాలను మళ్లీ ఒక చోటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది మరి ఆ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో వేచి చూడాలి.

బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లే..: మంత్రి కోమటిరెడ్డి