పోనీలే అని అవకాశం ఇస్తే.. దర్శకుడికే క్లాస్ పీకిన రాజనాల?

ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి అని అంటూ ఉంటారు కదా.ఈ సామెత సినిమాల్లో సరిపోతూ ఉంటుంది.

ఎందుకంటే ఒకప్పుడు నటుడిగా చక్రం తిప్పిన వారు ఆ తర్వాత మాత్రం అవకాశాలు లేక దీనస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

ఇక అప్పట్లో రాజనాల విషయంలో కూడా ఇలాగే జరిగిందట.ఓ సినిమా సమయంలో వీరకొండలరావు ద్రోణాచార్యుడి వేషం వేస్తే ఇక రాజనాల దుర్యోధనుడు వేషం వేశాడు.

ఆ సమయంలో ఇక ద్రోణాచార్యుడి కాళ్లు కడిగి దుర్యోధనుడు ఆ నీటిని నెత్తి మీద చల్లుకునే సన్నివేశం ఉంటుంది.

ఈ సీన్ చేసేందుకు రాజనాల ముందుగా ఒప్పుకోలేదట.డూప్ ను పెడితే బాగుంటుందని దర్శకుడుకీ సలహా ఇచ్చాడట.

ఇక సీన్ అలాగే ఉంటుందని రాజనాల చేయక పోతే ఇంకో దుర్యోధనుడిని వెతుక్కోవాల్సి వస్తోందని చెప్పడంతో రాజనాల చివరికి వెనక్కి తగ్గి సీన్ చేసారట.

ఇక ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గిపోవడంతో ఆస్తులు కరిగిపోయి దీనస్థితిని ఎదుర్కొన్నారట రాజనాల.

ఆ సమయంలోనే ఏదైనా వేషం కావాలంటే కొండలరావు దగ్గరికి వచ్చారట. """/"/ ఈ క్రమంలోనే ఓ సినిమాలో ముసలి తండ్రి పాత్రను కొండలరావు చేయాల్సి ఉండగా ఇక ఆ పాత్రను చిత్ర బృందం తో మాట్లాడి రాజనాలకు వచ్చేలా చేశారట.

కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజనాల ఏకంగా దర్శక నిర్మాతలకు తలనొప్పి తెప్పించారట.

సినిమా పరిశ్రమలో సీనియర్ కావడంతో ఏ సీన్ ఎలా తీయాలి అనేది ఇక దర్శకులకు రాజనాల ఎక్కువగా వివరించడం చేశారట.

దీంతో దర్శకుడు వెంటనే కొండల రావు కి ఫోన్ చేసి ఈయనను మాకు తగిలించారు ఏంటి అని అడిగారట.

అలా చేయకండి అని రాజనాల కు చెప్పండి అంటూ కొండలరావు దర్శకుడుకీ చెప్పాడట.

ఆయన సీనియర్ ఆయనకు ఇంకేం చెప్పగలం.కొన్నాళ్లపాటు భరించడం తప్ప అని దర్శకుడు సమాధానం చెప్పి ఇక షూటింగ్ కొనసాగించారట.

బీజేపీ చేరాలంటే ఇన్ని కండిషన్లా ?  అందుకేనా కాంగ్రెస్ లోకి క్యూ ?