రాజమౌళి కొడుకు ఆయన సొంత కొడుకు కాదట…నిజం ఏంటంటే…?
TeluguStop.com
రాజమౌళి తీసిన సినిమాల గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో అద్బుతం అనే చెప్పాలి అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రాజమౌళి కొడుకు కార్తికేయ( Karthikeya ) గురించి చాలా మంది కి తెలీదు.
ఈయన లైన్ ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు పొందాడు.ఓ సినిమాను రీజనల్ బౌండరీ దాటించడంలో, ప్రమోషన్స్ చేయడంలో కార్తికేయ మహా దిట్ట.
`ఆర్ఆర్ఆర్`(RRR) చిత్రానికి ఆస్కార్ దక్కింది అంటే దాని వెనక కార్తికేయ కృషి కూడా ఎంతో ఉంది అనడంలో సందేహం లేదు.
ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసే ప్రాసెస్ నుండి ఆర్ఆర్ఆర్ మూవీ క్యాంపైన్ బాధ్యతల వరకు అన్ని కార్తికేయ దగ్గరుండి చూసుకున్నాడు.
"""/" /
అలాగే ప్రతి విషయంలోనూ తండ్రి రాజమౌళికి కార్తికేయ(Karthikeya) బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ గా వ్యవహరిస్తాడు.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదు.
ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.రాజమౌళి రమ(Rama)ను ప్రేమించి 2001లో వివాహం చేసుకున్నారు.
అయితే నిజానికి అంతకుముందే రమకు పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి.రమ తన మొదటి భర్త ద్వారా ఓ కొడుకుకు జన్మనిచ్చింది.
అతడే కార్తికేయ.అయితే కార్తికేయను రాజమౌళి తన సొంత కొడుకులా స్వీకరించాడు.
అలాగే వివాహం అనంతరం రాజమౌళి, రమ ఓ కూతురును దత్తత తీసుకున్నారు.ఆమె పేరు మయూఖ.
అయితే రాజమౌళి ని కార్తికేయ ఇప్పటి కూడా నాన్న అని పిలవడట ఎప్పుడు అతన్ని బాబా అనే పిలుస్తాడట.
నిజం గా ఈ విషయం లో రాజమౌళి గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే ఎవరికో పుట్టిన అబ్బాయిని కొడుకు లాగా స్వీకరించడం అంటే నిజం గా చాలా గ్రేట్.
ఈ విషయం తెలిసిన చాలా మంది రాజమౌళి ని మెచ్చుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అతిథులు ఎవరంటే?