ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి

ఈ ఏడాదిలో సగకాలం కరోనా లాక్ డౌన్ లో గడిచిపోయింది.ఓ విధంగా చెప్పాలంటే చాలా మంది జీవితాల నుంచి ఒక ఆరు నెలల కాలం దూరం అయ్యింది.

ఈ లాక్ డౌన్ కాలంలో చాలా మంది జీవితాలు తారుమారు అయిపోయాయి.

ఇక సినిమానే ప్రపంచంగా బ్రతుకుతున్న వాళ్ళ జీవితాలలో కూడా ఊహించని మార్పులు తీసుకొచ్చింది.

పెద్ద స్థాయి సెలబ్రెటీల వరకు ఆర్ధిక ఇబ్బందులు లేకపోయిన రోజు వారి జీతం మీద ఆధారపడి టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ ల బ్రతుకులు దుర్భరంగా మారిపోయాయి.

అయితే ఇంతకాలం తర్వాత మరల వాళ్లందరికీ పని దొరుకుతుంది.దర్శక, నిర్మాతలు ధైర్యం చేసి షూటింగ్ లు స్టార్ట్ చేయడంతో కొంత ఉపశమనం లభించింది.

మొన్నటి వరకు చిన్న హీరోల సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉండేవి.ఈ నెల నుంచి షూటింగ్ ల విషయంలో ప్రభుత్వం పరిమితులు తొలగించడంతో స్టార్ హీరోలు కూడా షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్నారు.

దర్శక దిగ్గజం జక్కన్న రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు.

ఈ చిత్రం షూటింగును హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో లాక్ డౌన్ తర్వాత తిరిగి ప్రారంభించారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటూ ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

ముందుగా ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నట్టు చెబుతున్నారు.

ఇందులో ఎన్టీఆర్ కి రాహుల్ స్నేహితుడిగా నటిస్తున్నాడని, వీరిపై కొన్ని దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తుంది.

విజయదశమికి ఆర్ఆర్ఆర్ నుంచి కానుకగా ఎన్టీఆర్ కి సంబంధించిన క్యారెక్టర్ టీజర్ ను రిలీజ్ చేసే యోచనలో రాజమౌళి ఉన్నారు.

దానికి అనుగుణంగా సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అప్పులు చేసి చదువు.. ఒక్క మార్కుతో ఫెయిల్.. జోయా మీర్జా సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!