టాలీవుడ్ జక్కన్న వెబ్ సిరీస్ ప్లానింగ్ …?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీంతో అన్ని సినీ పరిశ్రమలు మూత పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇక సినిమా రంగం షూటింగ్స్ లు అన్నీ కూడా వాయిదా పడ్డాయి.అయితే తాజాగా సినిమా పరిశ్రమలో కరోనా వైరస్ ప్రభావం అధికసంఖ్యలో ఉంది.

దీంతో ప్రముఖ నిర్మాతలకు చాలా నష్టమే ఎదురవుతుంది.దీనితో ప్రముఖ దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్ లపై మొగ్గుచూపుతున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే చాలామంది ఓటీటీ ప్లాట్ ఫామ్ పై వెబ్ సిరీస్ లను రూపుదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.

ఇక తాజాగా తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక రాజమౌళి దర్శకత్వంలో కాకుండా ఆయన సారథ్యంలో వెబ్ సిరీస్ లు ముందుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.

ఇప్పటికే జక్కన్న ఒక టీం ను ఏర్పాటు చేసుకొని.మంచి ఐడియా లు ఉన్నవారికి ఆహ్వానించి వారిని ప్రోత్సహించడంతో పాటు వారితో వెబ్ సిరీస్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే ప్రస్తుతం వస్తున్న కొన్ని వెబ్ సిరీస్ లను కూడా చక్కన వీక్షిస్తున్నారు అన్ని వార్తలు.

అలాగే ఇక రాజమౌళికి కథల విషయంలో కూడా సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారట.

ఇక ఇవన్నీ కేవలం పుకార్లే అని చాలా మంది భావిస్తున్నారు.కాకపోతే, ఇది నిజం అయితే మాత్రం ఖచ్చితంగా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉంటుందని అంటున్నారు సినీ ప్రముఖులు.

మరి ఇప్పటికీ జక్కన్న ఆలోచనలు లేకుండా భవిష్యత్తులో అయినా ఓటీటీ లో అడుగు పెట్టాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో త్రప్తి డిమ్రి కి పెరుగుతున్న క్రేజ్…తన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?