రాజమౌళి విలన్ సుప్రీత్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయన సినిమా అంటే చాలు ఎప్పుడు అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు.

ఇక రాజమౌళి ఒక సినిమా చేశాడు అంటే ఆ సినిమాలో కేవలం హీరో, హీరోయిన్ కి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి అందులో ప్రాధాన్యత ఉంటుంది.

హీరో నుంచి కమెడియన్ వరకు ప్రతిఒక్కరు గుర్తుండిపోతారు.ఇక అలా గుర్తుండిపోయే పాత్రే సుప్రీత్ రెడ్డిది.

పేరు కొత్తగా అనిపించినా ముఖం చూస్తే మాత్రం మన విలన్ ఏ ఇతను అని అంటారు.

అందరికి ఇతను పరిచయం ఉంది మరి.ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా విలన్ పాత్రలో.

కీలక పాత్రలో నటించాడు సుప్రీత్ రెడ్డి.అప్పట్లో స్టార్ డైరెక్టర్ అయినా తేజ సినిమా జయం అవకాశం రాగ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఆతర్వాత పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో ఓ చిన్న రోల్ లో నటించి అందరిని మెప్పించాడు.

ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సుప్రీత్ రెడ్డి ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.

నిజానికి సుప్రీత్ రెడ్డికి చిన్ననాటి నుంచే సినిమాలు అంటే ఆసక్తి ఎక్కువ.అప్పటి నుంచి ఎలా అయినా సినిమాలోకి రావాలి అని అనుకున్నప్పటికీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.

అంతేకాదు సుప్రీత్ రెడ్డి జిల్లా స్థాయిలో మంచి వాలీబాల్ ప్లేయర్ అంట.జానీ సినిమాలో సుప్రీత్ ని చుసిన రాజమౌళి సైలో అవకాశం ఇవ్వగా నిరూపించుకున్నాడు.

దీంతో ఆతర్వాత ఛత్రపతి సినిమాలోను తీసుకోగా ఆ సినిమాతో మంచి విలన్ గా ఓ రేంజ్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

ఆతర్వాత టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.ప్రస్తుతం ఏ సినిమాల్లో కనిపించని సుప్రీత్ చివరి చిత్రం ప్రభాస్ నటించిన సాహూ.

ఆ సినిమా తర్వాత మరే సినిమాల్లోనూ కనిపించలేదు సుప్రీత్ రెడ్డి.