రాజమౌళి బ్రహ్మాస్త్ర ఎడిటర్..?

బాలీవుడ్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాని తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాకి ముందునుంచి చాలా సపోర్ట్ గా ఉన్నాడు రాజమౌళి.

అయాన్ ముఖర్జీ డైరక్షన్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమాకి రాజమౌళి ఎడిటర్ గా పనిచేశారని లేటెస్ట్ టాక్.

రాజమౌళి ఏంటి ఎడిటర్ గా పనిచేయడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు.రాజమౌళి సమర్పణలో వస్తున్న సినిమా అంటే తన బ్రాండ్ ఉండాల్సిందే.

అందుకే సినిమాని ముందే చూసి కావాల్సిన ఇంపుట్స్ ని ఇస్తున్నారట రాజమౌళి.ఈ క్రమంలో బ్రహ్మాస్త్ర ఎడిటింగ్ విషయంలో కూడా రాజమౌళి పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ బాహుబలిగా వస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాని ఎలాగైనా హిట్ చేయాలని చూస్తున్నారు.అయితే మరోపక్క బాలీవుడ్ లో ఈ సినిమాని కూడా బాయ్ కాట్ చేయాలని ట్రెండ్ చేస్తున్నారు.

ఆల్రెడీ బాయ్ కాట్ ఎఫెక్ట్ పడి ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

 అయితే వాటి సరసన బ్రహ్మాస్త్ర నిలవకుండా వెరైటీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

తెలుగులో కూడా బ్రమాస్త్ర సినిమాని భారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

రామ్ చరణ్ తో తీసే మూవీ పక్కా హిట్.. మెగా ఫ్యాన్స్ కు బుచ్చిబాబు హామీ ఇదే!