మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూనే ఉంది.
ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించిన విషయం తెలిసిందే.సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్త సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.
ఇకపోతే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా నుంచి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ రాజమౌళి మాత్రం అస్సలు స్పందించలేదు.
మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమాకు సంబంధించి రాజమౌళి అస్సలేం మాట్లాడటం లేదు.
తన నోటి నుంచి ఆ పదాన్ని కూడా ఉచ్ఛరించడం లేదు.ఎందుకింత గుంభనం.
కనీసం షూటింగ్ నడుస్తోందని చెప్పినా సరిపోయేది కదా.పోనీ ఈ సినిమా గురించి స్పందించకపోయినా షూటింగ్ అయిన నిలిపేసాడా అంటే అది లేదు.
ఒక వైపు మహేష్ తో సినిమా షూటింగ్ కొనసాగిస్తూనే ఉన్నాడు రాజమౌళి.రాత్రి కూడా షూటింగ్ పూర్తి చేసుకొని మరీ నాని సినిమా ఫంక్షన్ కు వచ్చాడు.
త్వరలోనే యూనిట్ అంతా కలిసి ఆఫ్రికా షెడ్యూల్ కు కూడా వెళ్లబోతున్నారు.అయితే ఇంత జరుగుతున్నా రాజమౌళి మాత్రం మౌనం వీడడం లేదు.
గతంలో ఎప్పుడూ ఈ దర్శకుడు ఇలా వింతగా ప్రవర్తించలేదు. """/" /
చివరికి ఎన్టీఆర్, చరణ్ తో చేసిన భారీ బడ్జెట్ సినిమాపై కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ వచ్చాడు.
మరి ఈసారి ఏమైంది? ఈ మౌనం వెనక వ్యూహం ఏంటి? అసలు ఎందుకు రాజమౌళి మౌనంగా ఉన్నాడు అన్నది అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చాడు రాజమౌళి.
ఈసారి కూడా ఎప్పట్లానే సినిమా గురించి రాజమౌళిని ప్రశ్నించారు సుమ.కానీ రాజమౌళి ముసిముసిగా నవ్వాడు తప్ప కనీసం నోరు విప్పలేదు.
ఇలా చేయడం వరుసగా ఇది రెండోసారి.జక్కన్న వ్యవహారశైలితో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
ఒక్క మాట చెబితే ఏం పోతుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.మరి ఇప్పటికైనా జక్కన్న తన మౌనాన్ని వీడి మహేష్ సినిమా గురించి ఏమైనా మాట్లాడతారేమో చూడాలి మరి.