నిన్ను పెట్టి సినిమా తీస్తే ఎవడైనా చూస్తాడా అంటూ తారక్ పై రాజమౌళి ఆగ్రహం
TeluguStop.com

జూనియర్ యన్టీఆర్.ప్రస్తుతం తెలుగు తెరపై ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.


నటనలో, డ్యాన్స్ లలో, ఫైట్స్ లో దుమ్ము రేపుతూ.టాప్ గేర్ లో దూసూకుపోతున్నాడు తారక రాముడు.


ఇక వరుస విజయాలతో అభిమానుల అంచనాలను కూడా అందుకుంటున్నాడు.ప్రస్తుతం జూనియర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.
ఆర్.ఆర్' మూవీలో నటిస్తున్నాడు.
మిగతా హీరోలంతా రాజమౌళి వెనక పడుతుంటే.జక్కన్న మాత్రం యన్టీఆర్ తో సినిమా చేయడానికి తహతహలాడుతూ ఉంటారు.
ఇక తారక్ కూడా దర్శక ధీరుడుతో అంతే క్లోజ్ గా ఉంటాడు.అయితే.
, ఇంత అనుబంధం ఉన్నా., రాజమౌళి ఓసారి జూనియర్ యన్టీఆర్ పై సీరియస్ అయిపోయాడట.
ఇష్టం వచ్చినట్టు అరిచేశాడట.గతంలో ఓసారి ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ మీడియా ముందు చెప్పారు కూడా.
'నిన్ను చూడాలని' మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ నందమూరి చిన్నోడు.
'స్టూడెంట్ నంబర్1' తో తొలి విజయాన్ని అందుకున్నాడు.ఆ సినిమా దర్శకుడు రాజమౌళినే.
ఆయనకి దర్శకుడిగా అదే తొలి సినిమా.ఇక 'సింహాద్రి' తరువాత యన్టీఆర్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.
ఆ సినిమా కూడా రాజమౌళి క్రియేషనే.ఇలా తారక్.
రేంజ్ ని ఆకాశాన నిలపడంలో రాజమౌళి పాత్ర కీలకమైనది.కానీ.
, ఒకానొక దశలో యన్టీఆర్ వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు.ఒక్క హిట్ కోసం ఏళ్ళు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
'రాఖీ' లాంటి మంచి సినిమా చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.దీనికి కారణం జూనియర్ ఫిజిక్.
'రాఖీ' సినిమా నాటికి యన్టీఆర్ ఎంత లావు ఉన్నాడో అందరికీ గుర్తుండే ఉంటుంది.
"""/"/
ఆ సమయంలోనే రాజమౌళి ఓ సారి జూనియర్ ని ఇంటికి రమన్నాడట.
అప్పుడు."తారక్ నువ్వు ఎంత లావు ఉన్నావో నీకు అర్ధం అవుతోందా? యూత్ నీ సినిమాలు చూడటం మానేశారు.
లేడీ ఫాలోయింగ్ కూడా తగ్గిపోయింది.ఇలానే లావుగా ఉంటే అన్నీ రకాల కథలకి నువ్వు సెట్ అవ్వవు.
ఎదురవుతున్న వరుస పరాజయాల గురించి పట్టించుకోకుండా., ముందు బాడీపై దృష్టి పెట్టు" అని క్లాస్ పీకాడట రాజమౌళి.
తనకి ఆత్మీయుడైన జక్కన్న అంతలా చెప్పడంతో యన్టీఆర్ కూడా కష్టపడి స్లిమ్ అయ్యాడు.
"""/"/
అలా సన్నబడిన తరువాత జూనియర్ యన్టీఆర్ తో 'యమదొంగ' సినిమా తెరకెక్కించారు రాజమౌళి.
ఇందులో సన్నగా చిరుతలా పరుగులు తీసిన యన్టీఆర్ ని చూసి నందమూరి అభిమానుల హృదయాలు పులకించి పోయాయి.
ఫలితం యముడిగా జూనియర్ సూపర్ హిట్.తారక్ వరుస పరాజయాలకు బ్రేక్.
ఇక అక్కడ నుండి యన్టీఆర్ ని అన్నీ రకాల పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి.
కాబట్టి.తారక్ ని రాజమౌళి తిట్టినా.
, అది ఆయన మంచి కోసమే.మరి.
ఆర్' లో మన కొమరం భీమ్ చేత జక్కన్న ఎలాంటి సాహసాలు చేపిస్తాడో చూడాలి.