సూర్యతో ఆ అవకాశాన్ని నేనే మిస్ అయ్యాను.. జక్కన్న కామెంట్స్ వైరల్!

తమిళ హీరో సూర్య( Hero Surya ) హీరోగా నటించిన తాజా చిత్రం కంగువ.

( Kanguva ) ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గురువారం నిర్వహించారు.

హైదరాబాదులో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళితో పాటు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ లు గెస్టులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి( Rajamouli ) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"""/" / రాజమౌళి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గ‌జిని సినిమాను ప్ర‌మోట్ చేయ‌డానికి మొద‌టిసారి తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చిన సూర్య‌.ఆ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎలా ద‌గ్గ‌ర‌య్యాడ‌న్న‌ది కేస్ స్ట‌డీలా తెలుగు నిర్మాత‌ల‌కు తాను చెబుతుంటాన‌ని రాజ‌మౌళి అన్నారు.

సూర్య ఎలాగైతే వ‌చ్చి త‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌ ను ఇక్క‌డ చేస్తున్నాడో మ‌న సినిమాల‌ను కూడా ఇత‌ర భాష‌ల్లో అలాగే ప్ర‌మోట్‌ చేయాల‌ని హీరోల‌కు చెబుతుంటాన‌ని రాజ‌మౌళి తెలిపారు.

పాన్ ఇండియ‌న్ మూవీ బాహుబ‌లి( Bahubali ) చేయ‌డానికి సూర్య‌నే నాకు స్ఫూర్తి.

"""/" / ఒక‌సారి సూర్య‌, నేను క‌లిసి సినిమా చేయాల‌ని అనుకున్నాం.కానీ కుద‌ర‌లేదు.

ఒక సినిమా వేడుక‌లో నాతో క‌లిసి సినిమా చేసే అవ‌కాశాన్ని మిస్స‌య్యాను అని సూర్య అన్నారు.

నిజానికి సూర్య‌తో ప‌నిచేసే అవ‌కాశాన్ని నేనే మిస్ చేసుకున్నాను.సూర్య స్క్రీన్ ప్ర‌జెన్స్‌, యాక్టింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం.

ఫిల్మ్ మేక‌ర్‌ గా క‌థ‌ల ఎంపిక‌లో అత‌డు తీసుకునే నిర్ణ‌యాల్ని నేను గౌర‌విస్తున్నాను.

కంగువ కోసం సూర్య ప‌డిన క‌ష్టం ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తోంది.సూర్య క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం త‌ప్ప‌కుండా ల‌భిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది అని జక్కన్న తెలిపారు.

బేబీబంప్ తో షాక్ ఇచ్చిన సమంత… వైరల్ అవుతున్న బేబీబంప్ ఫోటో?