'రాధేశ్యామ్‌' ఈవెంట్‌ కు రాజమౌళి ఆహ్వానిస్తే రానన్నాడట!

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దం అయ్యింది.

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.

ఈ నెల 23న భారీ ఎత్తున రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు.

ఆ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొనబోతున్న గెస్ట్‌ ఎవరు అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలోనే రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ప్రత్యేకంగా గెస్ట్‌ ఎవరు లేరని తేల్చి పారేశారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రత్యేక గెస్ట్‌ లేకుండానే ఈవెంట్‌ ను పూర్తి చేయబోతున్నారట.

ఇది గతంలో చాలా సినిమాలకు జరిగింది.కాని ఈ సినిమా విషయంలో ఇలా జరగడం అభిమానులకు నిరాశ కలిగించే విషయం.

రాధే శ్యామ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం రాజమౌళిని ఆహ్వానించారనే వార్తలు వస్తున్నాయి.

"""/" / అయితే అదే తేదీన ముంబాయిలో ఆర్ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ ఉందట.

దాంతో ప్రభాస్ సినిమా ఈవెంట్‌ లో ముఖ్య అతిథిగా హాజరు కాలేను అంటూ తేల్చి చెప్పాడట.

దాంతో ముఖ్య అతిథి లేకుండానే కార్యక్రమం కానిచ్చేస్తారట.పెద్ద ఎత్తున అంచనాలున్న రాధే శ్యామ్‌ సినిమాను బాలీవుడ్ రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.

అక్కడ కూడా భారీ ఈవెంట్ ఒకటి నిర్వహించాల్సి ఉంది.కాని ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న దాఖలాలు లేవు.

మరి ప్రమోషన్‌ లేకుండా విడుదల అయితే ఎలా ఉంటుంది అనేది చూడాలి.పూజా హెగ్డే ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది.

యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు.ప్రభాస్ ఈ సినిమా లో జ్యోతిష్యుడిగా కనిపించబోతున్నాడు.

పూర్తిగా క్లాస్‌ లవ్‌ స్టోరీ ఇది.ఫైట్స్ కామెడీ ఈ సినిమాలో ఉండవని అంటున్నారు.

ఎయిర్ ఇండియాలో జర్నీ ఓ పీడకల.. సెన్సేషన్‌గా మారిన ప్యాసింజర్ పోస్ట్..