ఆర్‌ఆర్‌ఆర్‌ : ప్రస్తుతం ఏం షూట్‌ చేస్తున్నారో తెలిస్తే ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తుంది

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీకి విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు రాజమౌళి ఉన్నాడు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ప్రస్తుతం రామ్‌ చరణ్‌ పాల్గొంటున్నాడు.

సినిమాలోనే అత్యంత కీలకమైన సీన్స్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారట. """/"/బ్రిటీష్‌ వారు అల్లూరి సీతారామ రాజును అరెస్ట్‌ చేసి చిత్ర హింసల పాలు చేస్తూ ఉంటారు.

ఆ తర్వాత అల్లూరిని కోర్టుకు తరలించే సీన్స్‌ కూడా అక్కడ చిత్రీకరణ చేస్తున్నారు.

వారం రోజుల తర్వాత ఈ చిత్రీకణ పూర్తి అవ్వబోతుంది.అప్పుడు ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లపై ఒక భారీ సాంగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట.

దాదాపుగా 1000 మంది డాన్సర్స్‌ మరియు జూనియర్‌ ఆర్టిస్టులతో పాటు వందలాది మంది టెక్నీషియన్స్‌తో ఈ పాటను షూట్‌ చేయబోతున్నారట.

"""/"/ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే ఒక వైపు ఈ పాట కోసం సెట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

రికార్డు స్థాయి బడ్జెట్‌ అవ్వడం వల్ల ఈ పాట ఎంత పెట్టి తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

రామ్‌ చరణ్‌ అల్లూరిగా కనిపించబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీంగా నటించబోతున్నాడు.

ఆలియా భట్‌ హీరోయిన్‌గా ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.ఇంకా బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ప్రముఖులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్లాప్ ఇచ్చి బాలయ్యకు హిట్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?