చెర్రీ విషయంలో భయపడ్డ అంటున్న రాజమౌళి!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాపై అభిమానులకు ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు.

ఇప్పటికి ఈ షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆరు నెలలు ఆలస్యం అయ్యింది.

ఇప్పుడిప్పుడే ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.మొన్నటికి మొన్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఆర్ఆర్ఆర్ టీజర్ వచ్చి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసింది.

ఇక ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్న రాజమౌళి తన కెరీర్ లో ఎన్నడూ ఓటమిని చూసింది లేదు.

ఒక సినిమా తీస్తున్నాడు అంటే అది కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే.ఎన్నేళ్ళైనా సరే సినిమాలు హిట్ అయ్యేలా ఒక శిల్పిలా రాజమౌళి చెక్కి అద్భుతంగా తెరకెక్కిస్తాడు.

అందుకే రాజమౌళి సినిమా అంటే అభిమానులు ఆ స్థాయిలో అంచనాలు పెంచుకునేది.సినిమా సినిమాకు తన పవర్ ను పెంచుకుంటూ వచ్చాడు రాజమౌళి.

అయితే అలాంటి రాజమౌళి కూడా ఒకానొక సమయంలో బయపడ్డాడట.ఏ విషయంలో భయపడ్డాడు అనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అదేనండి.రామ్ చరణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలని చిరంజీవి అడిగినప్పుడు రాజమౌళి భయపడ్డడటా.

దానికి కారణం రామ్ చరణ్ గురించి ఆయనకు ఏమి తెలియదని.రామ్ చరణ్ డ్యాన్స్ బాగా చేస్తాడా? ఏమోషన్స్ ఎలా పండిస్తాడు.

ఫైట్స్ ఎలా చేస్తాడు అనే విషయం తెలియక రాజమౌళి వెనకడుగు వేశారట.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం.

అంతేకాదు మొదటి సినిమా తర్వాత రామ్ చరణ్ తో నేనే సినిమా చేస్తాను అని చెప్పి చెర్రీతో మగధీర సినిమా చేశారట రాజమౌళి.

అలా చిరంజీవి ఇచ్చిన ఆఫర్ ని రాజమౌళి ఎంతో సున్నితంగా తిరస్కరించారట.

పాన్ ఇండియా సక్సెస్ కొట్టడానికి ట్రై చేస్తున్న స్టార్ డైరెక్టర్…