ఆ భావన వస్తే అదే నా పతనానికి నాంది.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది.ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా అంటూ వార్తలు వస్తున్నా మేకర్స్ మాత్రం ఈ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేయాలని భావిస్తున్నారు.

పదేపదే రిలీజ్ డేట్లు మార్చడం వల్ల సినిమా ఫలితంపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది.

మరోవైపు రాజమౌళి ప్రతి సినిమా సక్సెస్ సాధించిందనే సంగతి తెలిసిందే.రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా సక్సెస్ అని ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు.

తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

నా సినిమాలో ఎవరైనా నటిస్తారని నేను ఏం చెప్పినా ఓకే చేస్తారు అనే భావన ఉంటే అదే నా పతనానికి నాంది అని రాజమౌళి వెల్లడించారు.

తనకు అటువంటి ఆలోచన అయితే లేదని జక్కన్న తెలిపారు.రెండు పవర్ ఫుల్ పాత్రలతో సినిమా చేయాలని తనకు ఉండేదని జక్కన్న చెప్పుకొచ్చారు.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలతో సినిమా చేయాలని అనుకున్న సమయంలో ఎన్టీఆర్, చరణ్ మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేస్తారని తనకు అనిపించిందని రాజమౌళి అన్నారు.

"""/" / కథలో ఉండే ఉత్సాహం వల్లే రెండున్నర సంవత్సరాలుగా ఈ ప్రయాణం ఇలా సాగిందని రాజమౌళి తెలిపారు.

డబ్బు కోసమే సినిమాలు చేస్తామని పెట్టిన పెట్టుబడి రాకపోతే ఫెయిల్యూర్ గానే పరిగణించాలని రాజమౌళి చెప్పుకొచ్చారు.

"""/" / అదే జరిగితే కష్టం వృథా అయినట్టే భావించాలని రాజమౌళి అన్నారు.

తను తెరకెక్కించే ప్రతి సీన్ కు ఒక ఆలోచన ఉంటుందని యాక్టర్ సరిగ్గా చేయని పక్షంలో ఆలోచనకు తగిన సీన్ రాదని భయపడతానని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఎమోషన్లు ఉంటే మాత్రమే సీన్లు పండుతాయని నమ్ముతానని రాజమౌళి వెల్లడించారు.రాజమౌళి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీడియో వైరల్: ఏంటి భయ్యా.. ఇవి రోడ్డు డివైడర్స్ కాదా.. మరేంటో తెలుసా..?