50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడం కష్టం అంటున్న రాజమౌళి

కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన వ్యవస్థలు అన్ని కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ గాడిలో పడుతున్నాయి.

కేసులు పెరుగుతున్న డెత్ రేట్ తక్కువగా ఉండటం, కోలుకునే వారి సంఖ్య పెరగడంతో కరోనా ప్రమాదం అనే స్థాయి నుంచి కరోనా వచ్చిన బయటపడొచ్చు అనేస్థాయికి ప్రజల మైండ్ సెట్ వచ్చింది.

దీనికి తగ్గట్లే కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుంది.అలాగే కరోనా బారిన పడినవాళ్లు ఒకప్పటిలా భయపడకుండా ఇంటి వద్దనే ఉంటూ జాగ్రత్తలు తీసుకొని బయటపడుతున్నారు.

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మెల్లగా లాక్ డౌన్ నుంచి అన్ని రంగాలకి సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది.

తాజాగా కేంద్రప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్‌ చేసుకోవచ్చని ప్రకటించింది.దీనిపై థియేటర్ల యాజమాన్యం కూడా సమావేశం నిర్వహించి, కరోనా వ్యాపించకుండా ఉండటంతో పాటు, థియేటర్ మార్కెట్ ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు.

ఇక 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయడంపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్‌ చేయడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

పూర్తి స్థాయిలోనే రన్‌ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం.ఎందుకంటే విమానాల్లో రెండు, మూడు గంటలు ప్రయాణిస్తున్నాం.

విమానాలతో పోల్చితే థియేటర్లలో సీట్లు మధ్య ఎక్కువగానే గ్యాప్‌ ఉంటుంది.మరి అలాంటప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ ఓపెన్‌ చేయడం కరెక్ట్‌ కాదు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి తాత్కాలికంగా ఇలాంటి ప్రకటన చేసి ఉంటుందని అనుకుంటున్నాను.

50 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగించకుండా మరికొంత కాలం వేచి చూడటం బెటర్ అని అనుకుంటున్నా అంటూ తన అభిప్రాయం తెలియజేశారు.

ఎలాంటి క్రీమ్స్ అక్కర్లేదు.. ఈ ఒక్క ఆయిల్ ను వాడారంటే మచ్చలు పోయి మీ ముఖం వైట్ గా మారడం ఖాయం!