ఆ లెక్క ప్రకారం ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉండటానికి జక్కన్న కారణమా.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) రాజమౌళి( Rajamouli ) మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తారక్, రాజమౌళి దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టగా అటు తారక్ ఇటు రాజమౌళి కెరీర్ పరంగా అంచనాలను మించి సక్సెస్ అయ్యారు.
ఈ కాంబినేషన్ లో 4 సినిమాలు తెరకెక్కగా ఆ 4 సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయి.అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ హీరోగా ఉండటానికి ఒక విధంగా రాజమౌళి కారణమని చెప్పవచ్చు.
జక్కన్న సూచనల మేరకు రాఖీ సినిమా( Rakhi Movie ) వరకు బొద్దుగా ఉన్న తారక్ బరువు తగ్గిన సంగతి తెలిసిందే.
తారక్ బరువు తగ్గడం వల్లే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తూ విజయాలను అందుకుంటున్నారు.
తారక్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమాకు( Devara Movie ) సైతం పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి.
"""/" /
జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.
దేవర సినిమా రిలీజ్ కు మరో 4 నెలల సమయం ఉంది.దేవర మూవీ రిలీజైతే ఎన్టీఆర్ క్రేజ్ పరంగా కూడా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే సీన్లు సైతం అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
"""/" /
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ భారీ స్థాయిలో ఉండబోతుందని తారక్ ప్రతి సినిమా స్క్రిప్ట్ పరంగా మరో లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కన్నడ భాషలో సైతం జూనియర్ ఎన్టీఆర్ కు పాపులారిటీ పెరగడం గమనార్హం.తారక్ రాజమౌళి కాంబోలో రాబోయే రోజుల్లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.