రాజమౌళికి ఆ సినిమా అంత కష్టంగా అనిపించిందా.. ఐరన్ లెగ్ అన్నా పట్టించుకోరా?

టాలీవుడ్ దర్శక దీరుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన దర్శకుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

మగధీర( Magadheera) సినిమాతో తనలో ఉన్న టాలెంట్ మొత్తం బయటపెట్టిన రాజమౌళి బాహుబలి సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేశారు.

ఇక ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఈయన పేరు మారుమోగడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా లభించింది.

"""/" / ఇలా సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న రాజమౌళి తన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను మగధీర సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని తెలిపారు.

ఇక నా కెరియర్లో మగధీర సినిమా సమయంలో చాలా భయపడ్డానని తెలిపారు.అప్పట్లో ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ చాలా ఎక్కువ దాంతో తెగ కంగారు పడిపోయానని తెలిపారు.

"""/" / ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లను పెట్టుకోవాలని భావిస్తాను కానీ నేను రాసుకున్న కథకు ఏ హీరోయిన్ సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను ఆ హీరోయిన్ కి 10 ప్లాప్ సినిమాలు ఉన్నా, ఆమెను ఐరన్ లెగ్ అని అందరూ భావించిన వాటన్నింటిని నేను పట్టించుకోనని నా సినిమాలోని పాత్రకు సరిపోతే ఆ హీరోయిన్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా సినిమాలో తీసుకుంటానని ఈ సందర్భంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబు( Mahesh Babu ) తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాపై పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

గుహలో నిజంగానే 188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా.? నిజమెంత?