మహేష్ తో సినిమా గురించి మాట్లాడిన రాజమౌళి.. అభిమానులకు పండుగలాంటి వార్త?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో సినిమా రాబోతోంది అంటే ఆ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో మనందరికీ.

రాజమౌళి ఏదైనా ఒక సినిమాను చేయాలి అనుకున్నాడు అంటే ఆ సినిమా పూర్తయ్యే వరకు తదుపరి సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడడు.

ఈ నేపథ్యంలోనే ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యి బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగా భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా పూర్తయిన కారణంగా ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు అని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా లో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కు సంబంధించిన ఒక ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది సందర్భంగా సంతోషంతో ఉన్న రాజమౌళి తాజాగా ఒక నేషనల్ మీడియా తో మాట్లాడుతూ అసలు విషయాన్ని బయట పెట్టేసాడు.

అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ జక్కన్న, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కబోతోంది అంటూ ఆ మధ్య ఒక సారి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"""/"/ రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో ఈ సినిమా ఉండబోతోంది అని తెలిపాడు.

రెండు కథలు అనుకుంటున్నామని, ఆ రెండిట్లో మహేష్ బాబు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానినే త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లా బోతున్నట్టు తెలిపాడు.

మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక పండగలాంటి వార్త అని చెప్పవచ్చు.ఎప్పటి నుంచో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు కూడా ఒక చక్కని శుభవార్త అని చెప్పవచ్చు.

మరొక వైపు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా తెరకెక్కించాలని చిత్రబృందం సినిమాకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

పిల్లిని చంపి వండుకు తిన్న యూఎస్ మహిళ.. ఆమెకు పడిన శిక్ష తెలిస్తే..