రాజమౌళి రెండు నెలల పూర్తి విశ్రాంతి… ఆ తర్వాతే మహేష్‌ ప్రాజెక్ట్‌ షురూ

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్( RRR ) సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు( Oscar Award ) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నాటు నాటు పాట గురించి మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి కష్టానికి ఫలితం దక్కింది.

ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు కనీసం ఆస్కార్ నామినేషన్ కి కూడా అర్హం కాదని ఈ సినిమా ను పట్టించుకోలేదు.

అలాంటిది రాజమౌళి సొంతంగా ఆస్కార్ కి ప్రయత్నించి సఫలం అవ్వడం గొప్ప విషయం.

దేశం తరఫున ఆస్కార్ అవార్డు నామినేషన్స్ కి నాటు నాటు పాట వెళ్లి ఉంటే దేశానికి మరింతగా పేరు ప్రతిష్టలు దక్కేవి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

దేశం తరఫున వెళ్ళకున్నా నేరుగా వెళ్లిన నాటు నాటుకి ఆస్కార్‌ అవార్డ్‌ సొంతం అవ్వడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇక రాజమౌళి కష్టానికి ప్రతిఫలం దక్కింది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఇక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన కుటుంబ సభ్యులు మరియు మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రెండు నెలలు పూర్తి విశ్రాంతి లో రాజమౌళి ఉండబోతున్నారట.

తన ఫామ్ హౌస్ లో రాజమౌళి విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.అమెరికా లో ఏకంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న రాజమౌళి అక్కడ కూడా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి రాజమౌళి రెండు నెలల విశ్రాంతి తర్వాత మహేష్ బాబు సినిమా ను మొదలు పెట్టే అవకాశాలున్నాయి.

ఆ మధ్య ఆగస్టు నెలలో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్‌ లో సినిమా పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

అది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.