జక్కన్న ఇలా ఎన్నాళ్లు కమిట్‌మెంట్స్ సినిమాలు చేస్తూ ఇక్కడే ఉంటావు?
TeluguStop.com
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి క్రేజ్ బాహుబలి సినిమా తో బాలీవుడ్ ని దాటేసింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
బాహుబలి రెండు పార్ట్ లుగా విడుదల అయిన తర్వాత బాలీవుడ్ నుండి పెద్ద ఆఫర్లు రాజమౌళికి వచ్చాయి.
కానీ రాజమౌళి మాత్రం తనకు కమిట్మెంట్స్ ఉన్నాయి అంటూ తెలుగు సినిమా చేశాడు.
దాదాపు పదేళ్ల క్రితం దానయ్య వద్ద అడ్వాన్స్ తీసుకున్నాను అంటూ రాజమౌళి ఆయనకు సినిమా చేసి పెట్టాలనే ఉద్దేశంతో తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేయడం జరిగింది.
ఆ సినిమా ఇటీవలే విడుదలైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కూడా రాజమౌళి బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయి.అంతే కాకుండా హాలీవుడ్ సినిమా లకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
"""/"/
ఈ సమయంలో కూడా రాజమౌళి తనకు గతం లో ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా తెలుగులోనే సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.
కే ఎల్ నారాయణ నిర్మాణం లో మహేష్ బాబు హీరో గా పది పదిహేను సంవత్సరాల క్రితం ఒక సినిమా ను చేయాలని భావించారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ను చేయలేక పోయాను.ఇప్పుడు ఆ సినిమా చేయాల్సి ఉంది.
కనుక బాలీవుడ్లో కానీ ఇతర భాషల్లో సినిమా చేయలేనని రాజమౌళి చెప్పుకొచ్చాడు.బాహుబలి సినిమా తర్వాత ఆమీర్ ఖాన్ నుండి రాజమౌళి కి ఆఫర్ వచ్చిందట.
ఆ ఆఫర్ను సున్నితం గా రాజమౌళి తిరస్కరించాడు అంటూ ఇటీవల స్వయంగా విజయేంద్రప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇలా ఎంత కాలం కమిట్మెంట్స్ పేరుతో కేవలం తెలుగు సినిమాలను చేస్తారు.హిందీ మరియు హాలీవుడ్ సినిమాలకు వెళ్తే మీ స్థాయి మరింతగా పెరగడంతో పాటు మీ యొక్క గుర్తింపు మరింత విస్తరిస్తుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి మాత్రం తన కమిట్మెంట్ పూర్తి చేయడానికి మరో ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు తీసుకుంటాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనట.. గేమ్ ఛేంజర్ ను మించి బాలయ్య మెప్పిస్తాడా?