ఇకపై తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా రమ ఉండకూడదు అని డిసైడ్ అయిన రాజమౌళి..!

రాజమౌళి( Rajamouli) ఒక సినిమా తీస్తున్నాడు అంటే మాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్ తన కుటుంబ సభ్యుల డీల్ చేస్తారు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో ఏదో ఒకరు బాధ్యత తీసుకొని ఎంత రెస్పాన్సిబుల్ గా పనులు పూర్తి చేసే సినిమా విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషిస్తారు.

అలా చేయడం వల్లే సినిమాలు విజయవంతం అవుతున్నాయి అనేది వారి వాదన.సినిమా కోసం పెట్టే డబ్బుల్లో 90 శాతం వారి కుటుంబ సభ్యులకే వెళుతున్నాయి అనేది మిగతా వారి వాదన.

సరే ఈ వాదనలన్నీ కాసేపు పక్కన పెడితే తన సినిమాకు ఇకపై రమ( Rama) కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేయకూడదని ఒక సమయంలో రాజమౌళి అనుకున్నారట.

"""/" / మరి అంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి గల కారణమేంటి ఆ తర్వాత ఎందుకు మళ్లీ రమ నే కంటిన్యూ చేస్తున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మగధీర సినిమా( Magadheera ) టైం లో కాజల్ కొండపై నుంచి కింద పడిపోయే సన్నివేశంలో హాలీవుడ్ సినిమా స్టైల్ లో కాస్ట్యూమ్ డిజైన్ చేయాలని రాజమౌళి అనుకున్నారట.

దానికోసం సినిమా ఆటోగ్రాఫర్ అయినా సెంథిల్ తోను అలాగే కాస్టింగ్ డిజైనర్ అయిన రమతో కూడా డిస్కషన్ చేశారట.

రాజమౌళి సలహాతో అందరూ ఒకే అనుకొని దానికి తగ్గట్టుగా డ్రెస్సులు వాటి కలర్స్ కూడా డిసైడ్ చేశారట.

"""/" / అంతా ఓకే అనుకొని తీరా సెట్ కి వచ్చాక కాజల్ వారు ముందు డిసైడ్ చేసిన డ్రెస్ కాకుండా మరో డ్రస్ లో షూటింగ్ కి వచ్చిందట.

ఒకసారి గా కాజల్ ని చూసి కంగుతిన్న రాజమౌళి రమ నీ అడగక మీరు చెప్పిన డ్రెస్ కన్నా నేను ఇచ్చిన డ్రెస్ చాలా బాగుంటుంది అని సమాధానం చెప్పిందట.

పైగా చాలా లైట్ గా రాజమౌళి నిర్ణయాన్ని పక్కన పెట్టేయడంతో ఆయనకు బాగా కోపం వచ్చి ఇకపై తనను రమతో కలిసి పని చేయకూడదు అనుకున్నారట.

కానీ గ్రేడింగ్ వర్క్ ఫినిష్ అయి అవుట్ ఫుట్ వచ్చిన తర్వాత ఆ కాజల్ డ్రెస్ చాలా బాగా అనిపించిందట.

దాంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట రాజమౌళి.

కొరియన్ స్టార్ హృదయంలో నిలిచిన భారతీయ అభిమాని.. దశాబ్దం తర్వాత గుర్తుపట్టాడు..?