ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు రాజమౌళి డైరెక్షన్ బాలేదా.. హీరో వల్లే హిట్టైందంటూ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏ సినిమాకు దర్శకత్వం వహించినా ఆయన డైరెక్షన్ కు వంకలు పెట్టలేమని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.

మంచి పేరు సంపాదించుకున్న క్రిటిక్స్ సైతం రాజమౌళి సినిమాల గురించి విమర్శలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారనే సంగతి తెలిసిందే.

అయితే ఒక సినిమాకు మాత్రం రాజమౌళి సరిగ్గా డైరెక్షన్ చేయలేదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

ఈ కామెంట్లు చేసింది రాజమౌళి భార్య రమా రాజమౌళి కావడంతో ఈ కామెంట్ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన యమదొంగ సినిమా గురించి మాట్లాడుతూ రమా రాజమౌళి ఒక సందర్భంలో ఈ కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని రమా రాజమౌళి పేర్కొన్నారు.

జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో నచ్చని మూవీ ఏదనే ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పారు.

"""/" / కారణాలు చెప్పలేను కానీ యమదొంగ సినిమాకు రాజమౌళి డైరెక్షన్ నాకు నచ్చలేదని రమా రాజమౌళి చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ వల్లే యమదొంగ మూవీ హిట్టైందని రమ చేసిన కామెంట్లు తారక్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తే రాజమౌళి అభిమానులను మాత్రం ఒకింత నిరుత్సాహానికి గురి చేస్తాయి.

రాజమౌళి మాత్రం తన సినిమాలలో స్టూడెంట్ నంబర్ 1 నచ్చదని పలు సందర్భాల్లో చెప్పారు.

"""/" / రాజమౌళి సినిమాలలో చాలా సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా స్టూడెంట్ నంబర్ 1 సినిమాకు మాత్రం వేరే రచయిత కథ అందించారు.

ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.ఈ సినిమా సక్సెస్ సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కెరీర్ పుంజుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సింహాద్రి సినిమాతో తారక్, రాజమౌళికి స్టార్ స్టేటస్ వచ్చిందనే సంగతి తెలిసిందే.

దేవర హిట్టైనా అనిరుధ్ ను నమ్మట్లేదా.. వాళ్లు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వట్లేదా?