రాజమౌళి చదివింది ఇంటరే.. గాలికి తిరుగుతూ తండ్రికి నిర్లక్ష్య సమాధానం.. కట్ చేస్తే ఈ స్థాయికి?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు చాలా వరకు పెద్ద పెద్ద చదువులు చదివి ఇండస్ట్రీకి అడుగు పెడతారు అని అనుకుంటాము.

కానీ నిజానికి అందులో ఎంత మాత్రం నిజం ఉండదు.ఎందుకంటే ఏమి చదవని వాళ్ళు కూడా స్టార్ దర్శకులుగా మారారు.

అంతేకాకుండా స్టార్ నటీనటులు కూడా నిలిచారు.ఇక రాజమౌళి కూడా ఎంతో చదివాడు అని ఎంతోమంది ప్రేక్షకులు అనుకున్నారు.

కానీ ఆయన కూడా ఏ మాత్రం చదవలేదని ఈ మధ్యే తెలిసింది.నిజానికి ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో పెద్ద స్టార్ దర్శకుడిగా నిలిచాడు.

ఈయన సినిమాల కోసం స్టార్ హీరోలు కూడా ఎంతో ఎదురు చూస్తారు.చిన్న పాత్ర అయినా సరే అవకాశం వస్తే చాలు అని అనుకుంటారు.

అలాంటిది రాజమౌళి కేవలం ఇంటర్ మాత్రమే చదివాడట.వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా.

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడి గా నిలిచిన ఎస్ ఎస్ రాజమౌళి గురించి తెలుగు ప్రేక్షకులకే కాకుండా ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులకు కూడా చాలా పరిచయం.

బాహుబలి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.ఈ సినిమా కంటే ముందు కూడా ఎన్నో సినిమాలలో దర్శకత్వం వహించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించుకున్నాడు.

దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా కూడా మంచి పేరు అందుకున్నాడు.చాలావరకు పాన్ ఇండియా సినిమాలను రూపొందించి మంచి సక్సెస్ లను అందుకున్నాడు.

"""/"/ ఈయన ముందు బుల్లితెరపై పలు సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు.

ఆ తర్వాత వెండితెరపై జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత సింహాద్రి, సై, యమదొంగ వంటి చాలా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇక 2009లో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా కు దర్శకత్వం అందించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు అందించింది.

ఆ తర్వాత రాజన్న, ఈగ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

2015 లో బాహుబలి సినిమాతో మాత్రం చెప్పలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి మరో పాన్ ఇండియా మూవీ ఆర్.

ఆర్.ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. """/"/ ఇక ఇటీవలే ఈయన బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈయనతో పాటు కొరటాల శివ కూడా వచ్చి బాగా సందడి చేశాడు.ఎన్టీఆర్ రాజమౌళిని ఎంతవరకు చదివావు అని అడగగా ఇంటర్ వరకు చదివాను అంటూ మొత్తం కలిపి అన్ని 61.

62 శాతం వచ్చిందని తెలిపాడు.ఇక ఈయనకు ఇంటర్ తర్వాత లైఫ్ లో ఏం చేయాలన్నది క్లారిటీ లేకుండా పోయిందట.

"""/"/ చదువు ఎక్కదనే క్లారిటీ మాత్రం ఉండేది అని సరదాగా తెలిపాడు.తను ఊరికే గాలికి తిరుగుతుంటే తన నాన్నగారు పదే పదే తిడుతున్నారు అని డైరెక్టర్ అవుతాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడట.

దాంతో తన తండ్రి డైరెక్టర్ కావాలంటే అన్ని క్రాఫ్ట్ లను నేర్చుకోవాలి అని కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ లను నేర్పించాడట.

కొన్ని రోజులు తన తండ్రి దగ్గర అసిస్టెంట్ గా కూడా పని చేశాడట.

అలా సినిమాలంటే, రైటింగ్ అంటే, స్క్రీన్ ప్లే అంటే కొన్ని కొన్ని అర్థం అవుతున్నాయని ఆ తర్వాత కొన్ని రోజుల వరకు తన తండ్రి దగ్గర పని చేశానని కట్ చేసి చూస్తే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని తెలిపాడు.

వైరల్: వామ్మో.. ఈ మంచం ఏంటి ఇంత పెద్దగా ఉంది..