సలార్ సినిమా ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి… ధర ఎంతో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) త్వరలోనే సలార్ సినిమా ( Salaar Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ 12వ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా విడుదల కానున్న తరుణంలో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అయితే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ( Rajamouli ) సలార్ టీంని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / రాజమౌళి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో పాటు పృధ్విరాజ్ సుకుమారన్ ను కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారని తెలుస్తోంది.

త్వరలోనే ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వీడియో విడుదల కానుంది.ఇకపోతే ఈ ఇంటర్వ్యూ తర్వాత సలార్ సినిమా ఫస్ట్ టికెట్ ను దర్శక ధీరుడు రాజమౌళి కొనుగోలు చేశారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి సంధ్య 70 ఎంఎం థియేటర్లో శుక్రవారం ఉదయం 7 గంటల షోకి సంబంధించినటువంటి టికెట్ రాజమౌళి కొనుగోలు ఇచ్చేశారు.

"""/" / ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటో వైరల్ గా మారింది .

ఇందులో ప్రభాస్ తో పాటు ప్రశాంత్ పృధ్విరాజ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) నిర్మాత కూడా ఉన్నారు.

ఈ సినిమా నైజాం హక్కులను మైత్రి మూవీ వారు కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ టికెట్ రాజమౌళి ఎంత ధరకు కొనుగోలు చేశారనే విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

తనకి ఎంతో ఇష్టమైనటువంటి డార్లింగ్ ప్రభాస్ సినిమా ఫస్ట్ టికెట్ ను రాజమౌళి ఏకంగా 10,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు.

ప్రధాని మోడీకి పెళ్లి ఆహ్వానం అందించిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఫోటో వైరల్!