మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లినటువంటి ఘనత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి( Rajamouli ) మాత్రమే దక్కుతుందని చెప్పాలి.
ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈయన దర్శకత్వంలో వచ్చినటువంటి బాహుబలి( Baahubali ) సినిమా ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
ఈ సినిమాలో నటించినటువంటి నటుడు ప్రభాస్( Prabhas ) ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
"""/" /
ఇక రాజమౌళి సైతం అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందారు.
ఇలా రాజమౌళి సినీ కెరియర్ కు బాహుబలి సినిమా ఒక మైల్ స్టోన్ లాంటిదని చెప్పాలి.
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మరో బాహుబలి గురించి రాజమౌళి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
రాజమౌళి బాహుబలి సినిమా నుంచి మరో యానిమేటెడ్ సిరీస్ చేయబోతున్నారని తెలుస్తోంది. """/" /
ఈ యానిమేటెడ్ సిరీస్ కి సంబంధించిన విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్( Baahubali Crown Of Blood ) అనే పేరిట యానిమేటెడ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.
త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాబోతుందని వెల్లడించారు.ఇక ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మాహిష్మతి ప్రజలు ఆయన పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు విశ్వంలో ఏ శక్తి కూడా తన రాకను ఆపలేదు అంటూ రాజమౌళి ఈ సందర్భంగా చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.
ఇక ఈయన చేసిన ఈ పోస్టుతో మరోసారి ఈ యానిమేటెడ్ సిరీస్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అమ్మ బాబోయ్.. ఉడత గాల్లో ఎగరడం ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!