నాని రాజమౌళి కాంబినేషన్ రిపీట్ కానుందా.. ఈగ సీక్వెల్ ను అలా ప్లాన్ చేశారా? 

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలో పొందినటువంటి వారిలో దర్శకుడు రాజమౌళి( Rajamouli )ఒకరు.

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికే చెందుతుందని చెప్పాలి.

ఇలాంటి ఒక గొప్ప దర్శకుడుతో సినిమా చేయాలని ఎంతో మంది భావిస్తారు.అయితే ఇప్పటికే ఈయన డైరెక్షన్లో చేసిన హీరోలు కూడా మరోసారి అవకాశం ఇస్తే చేయాలని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలలో నాచురల్ స్టార్ నాని ( Nani ) కూడా ఉన్నారని చెప్పాలి.

"""/" / వీరిద్దరి కాంబినేషన్లో ఈగ సినిమా( Eega Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

అయితే ఇక సీక్వెల్స్ సినిమా కూడా చేయాలనే ఆలోచనలు రాజమౌళి ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా చేయాలి అంటే మరి కాస్త సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.

కానీ మరోసారి నాని రాజమౌళి ఇద్దరు కలిసి ఓ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారని తెలుస్తుంది.

అయితే అది సినిమా అనుకుంటే మనం పొరపాటు పడినట్లే వీరిద్దరూ కలిసి ఒకే స్టేజిపై ఒక పర్ఫామెన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.

"""/" / మే 4వ తేదీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దర్శకుల దినోత్సవం( Directors Day ) ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకులతో పాటు సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.

నాలుగు గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆటపాటలతో పాటు స్కిట్ లు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఇక నాలుగో తేదీ జరగబోయే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే డైరెక్టర్ లందరూ కూడా రిహార్సల్స్ కూడా మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే రాజమౌళితో పాటు నాని కూడా స్టేజ్ పై పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక రాజమౌళి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన మహేష్ బాబు సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

మలయాళం హీరోల బాటలో నడుస్తున్న తెలుగు సీనియర్ హీరోలు…