బన్నీ రాజమౌళి కాంబో సెట్ కాకపోవడం వెనుక ఏకంగా ఇంత కథ ఉందా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ( SS Rajamouli )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రాజమౌళి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

ఆర్ఆర్ఆర్, బాహుబలి( RRR, Baahubali ) లాంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు అదే ఊపుతూ మరిన్ని సినిమాలన్నీ తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.

త్వరలోనే మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.సినిమా సినిమాకి అతని రేంజ్ పెరిగిపోతూ ఉంది.

ఎవ్వరు అందుకోలేని హైట్స్ కి రాజమౌళి ఇప్పటికే చేరిపోయారు.నెక్స్ట్ హాలీవుడ్ లెవల్ లో ఒక ఇండియన్ దర్శకుడిగా సక్సెస్ కొట్టడమే రాజమౌళి టార్గెట్ గా ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రస్తుతం రాజమౌళి మూవీ ప్లాన్ చేశాడు.అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్( Amazon Forest Back Drop ) లో ఈ మూవీ కథని రాజమౌళి చెప్పబోతున్నారు.

వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర ఈ సినిమాలో ఉండబోతోంది.

ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ తో సినిమాలు చేశాడు.

అలాగే రవితేజ, నాని, నితిన్, సునీల్ లతో ఒక్కో మూవీ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun )తో మాత్రం రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.

"""/" / వారిద్దరూ సినిమా చేయబోతున్నారనే ప్రచారం కూడా ఎప్పుడు రాలేదు.దీంతో బన్నీతో జక్కన్న మూవీ చేసే ప్రయత్నం చేయలేదా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

మగధీర చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు.అయితే అంత పెద్ద హిట్ తర్వాత అరవింద్ రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేయకుండా ఉంటాడా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తోంది.

నిజానికి రాజమౌళి బన్నీతో మూవీ చేయాలని ప్లాన్ చేసాడని టాక్.బాహుబలి సిరీస్ తర్వాత బన్నీతోనే మూవీ చేయాలని రాజమౌళి అనుకున్నారట.

అయితే ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు.తరువాత అజిత్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రం చేయాలని ఆలోచించారట.

"""/" / కానీ ఇది కూడా కార్యరూపం దాల్చకుండానే ఆగిపోయింది.ఆ ఆలోచన స్ఫూర్తితోనే ఆర్ఆర్ఆర్ సినిమాని బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా తరువాత రాజమౌళి చేశారని ఇండస్ట్రీలో టాక్.

దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాని జక్కన్న ఎనౌన్స్ చేశారు.

ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి మూడేళ్లు సమయం పట్టొచ్చు.ఈ లోపు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

ఇవి అయ్యాక రాజమౌళి బన్నీ కాంబినేషన్ లో సినిమా ఏమైనా స్టార్ట్ అవుతుందా అనేది వేచి చూడాలి మరి.

బాలయ్య రామ్ చరణ్ అండ తో శర్వానంద్ హిట్టు కొట్టబోతున్నాడా..?