Rajamouli: రాజమౌళి దర్శకుడిగా కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారని తెలుసా.. ఏ సినిమా అంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ఎస్.

ఎస్.రాజమౌళి (S.

S Rajamouli) ఒకరు ఈయన కెరియర్ మొదట్లో సీరియల్స్ కి డైరెక్టర్ గా పని చేసేవారు.

అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మొదటి సినిమాలోని ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించగా ఏ ఒక్క సినిమా కూడా నిర్మాతలకు నష్టాలను తీసుకురాలేదు.

ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. """/" / ఇక రాజమౌళి చిన్నప్పటినుంచి సినీ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరగటం వల్ల ఈయనకు సినిమాలపై ఎంతో మక్కువ ఏర్పడింది.

దీంతో భారీ బడ్జెట్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ స్టార్ డైరెక్టర్గా( Star Director ) తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి రాజమౌళికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజమౌళి కేవలం దర్శకుడిగా మాత్రమే కాదని ఈయన బాల నటుడిగా( Child Artist ) కూడా ఒక సినిమాలో నటించారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

మరి రాజమౌళి నటించినటువంటి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే. """/" / రాజమౌళి బాల నటుడిగా నటించినటువంటి చిత్రం పిల్లలగ్రోవి( Pillanagrovi Movie ) ఈ సినిమాకు స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా ఆయన సోదరుడు శివశక్తి దత్త దర్శకుడిగా వ్యవహరించారు.

ఈ సినిమా బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో చిన్నపిల్లల చుట్టూ ఉండే కథ.ఇది అప్పట్లోనే అంత మంచి కథను రాసుకొని సినిమాను మొదలుపెట్టారు.

కానీ ఆ సినిమాను పూర్తిగా రిలీజ్ చేయలేకపోయారు.ఈ సినిమాలో రాజమౌళి, ఆయన కజిన్ శ్రీలేఖ, నిర్మలమ్మ, సోమయాజులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమా షూటింగ్ మొత్తం పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్ నిర్వహించారు.

"""/" / ఇలా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా చివరి దశ షూటింగ్ కి వచ్చేసరికి నిర్మాతల వద్ద డబ్బు లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఈ సినిమాని షూటింగ్ చేసి విడుదలకు సిద్ధం చేయలేకపోయారు దీంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది.

పిల్లనగ్రోవి సినిమాలో రాజమౌళి నటించినప్పుడు ఆయనకు కేవలం 10 సంవత్సరాల వయసు అని తెలుస్తుంది.

ఒకవేళ ఈ సినిమా కనుక విడుదలై ఉంటే రాజమౌళి నటన ఎలా ఉండేదో తెలుస్తుంది.

ఇక ఈ పాత్ర ద్వారా రాజమౌళి మంచి గుర్తింపు సంపాదించుకొని గనుక ఉంటే బహుశా హీరో గానే ప్రయత్నాలు చేసే వారేమోనని పలువురు భావిస్తున్నారు అయితే ఈయన హీరో కాకపోయినా డైరెక్టర్గా తెరువెనక ఉండి సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

పొట్టి డ్రెస్ లో కాకరేపుతున్న సమంత… ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా సామ్!