ఆ రోజు నేను ఎంతో మానసిక వేదన అనుభవించాను: రాజమౌళి
TeluguStop.com
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) గురించి పరిచయం అక్కర్లేదు.బాహుబలి,( Bahubali ) ఆర్ ఆర్ ఆర్( RRR ) సినిమాలతో జక్కన్న దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి.
రాజమౌళి సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ అన్న రీతిలో ఏళ్ల తరబడి సినిమాను ఓ దృశ్య కావ్యంలా చెక్కుతారు.
అందుకే రాజమౌళిని జక్కన్న( Jakkanna ) అనే పేరుతో పిలుస్తూ ఉంటారు.రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ అన్న సంగతి అందరికీ తెలిసినదే.
అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి.బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో వేల కోట్ల వసూళ్లు తెలుగు సినిమాకు సాధ్యమే అని ప్రత్యక్షంగా సాధించి నిరూపించాడు.
ఈ క్రమంలోనే తెలుగు సినిమా స్థాయి నేడు గ్లోబల్ స్థాయికి చేరింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు! """/" /
ఇక దాదాపుగా 2 దశాబ్దాలుగా ఇండియన్ సినిమాను ఏలుతున్న రాజమౌళి భారీగా సంపాదించారు అనేది చాలా సాధారణమైన అంశమే అయినప్పటికీ రాజమౌళి ఒకప్పటి జీవితం గురించి తెలిస్తే మాత్రం మనందరికీ ఆశ్చర్యం కలగక మానదు.
రాజమౌళి కుటుంబం( Rajamouli Family ) అత్యంత పేదరికం అనుభవించిందని మీకు తెలుసా? నిత్యావసర సరుకులకు కూడా వారు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేదట.
ఈ విషయం రాజమౌళి ఓ సందర్భంలో స్వయంగా వెల్లడిస్తూ, అనేక ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే సదరు యాంకర్, జీవితంలో మీరు ఎపుడైనా బాధ పడ్డ క్షణం గురించి చెబుతారా? అని అడిగినపుడు.
జక్కన్న మాట్లాడుతూ, బాహుబలి సినిమా రిలీజ్ సమయాన్ని నెమరు వేసుకున్నారు. """/" /
రిలీజైన ప్రతిచోటా సినిమా బావుందంటే, తెలుగునాట మాత్రం సినిమా ప్లాప్ టాక్ వచ్చిందని.
అప్పటి క్షణాల్ని గుర్తు చేసుకున్నారు.ఆ సమయంలో తీవ్రమైన వత్తిడికి లోనయ్యారట రాజమౌళి.
సినిమా నిజంగా ప్లాప్ అయితే, అన్ని వందల కోట్లు బడ్జెట్ పెట్టిన నిర్మాతల పరిస్థితి ఏమిటి? అని చాలా బాధపడ్డారట.
నిజమే, అది చాలా దారుణం.బాహుబలి 1( Bahubali 1 ) రిలీజ్ అయిన రోజు అంటే జులై 10, 2015 నాడు సినిమాకి డైవైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసినదే.
తరువాత రెండో రోజునుండి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో జక్కన్న ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న సంగతి విదితమే.
మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ 2025 జనవరిలో ప్రారంభం కానుంది.
దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి కేటాయిస్తున్నారట.
జక్కన్న అంటే ఏమాత్రం ఉండాలి మరి!.