హీరోలందు ఈ హీరో వేరయా.. ఆస్తి, కులం అసలు పట్టించుకోడు..?

భారతదేశంలో చాలామందికి కులాల పట్టింపు ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.కాలేజీ ఫ్రెండ్స్ లాంటి వారి మధ్య కులాల ప్రస్తావన రాదేమో కానీ మిగతా అన్నిచోట్ల మాత్రం మీదే కులం? అని అడుగుతుంటారు.

ఒకే కులం వారైతే వారికి ఫేవరబుల్ గా ఉండటం మొదలు పెడతారు.వారికి నచ్చని కులం వారైతే దూరం పెడతారు.

అన్ని రంగాల్లో ఇలాంటి ఒక మైండ్ సెట్ అనేది పాతుకు పోయింది.సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోలు, దర్శకులు, నిర్మాతలకు కులాల పట్టింపులు ఉంటాయి.

పైకి మాత్రం టాలెంట్ ఉంటే సరిపోతుంది కదా, కులాలతో సంబంధం ఏంటి అంటూ మాట్లాడుతుంటారు.

కానీ వారి మనసు లోతుల్లో సొంత కులాల వారిపై ఎంతో కొంత ప్రేమ ఉంటుంది.

"""/" / అయితే ఇలాంటి హీరోలందరికీ ఒక హీరో మాత్రం చాలా భిన్నంగా నడుచుకుంటాడు.

ఆ హీరో ఒకరి ఆస్తి లేదా కులం గురించి అస్సలు అడగడు.అందరితో చాలా బాగా మాట్లాడుతాడు.

ఒకరిని కూడా దూరం పెట్టే మనస్తత్వం కాదు అతనిది.అతను గొప్ప కులంలోనే పుట్టాడు.

అయినా సరే తనని ఎవరైనా ఆ కులం పేరు పెట్టి పిలిస్తే బాగా కోప్పడతాడు.

తనని సాధారణ, మామూలు వ్యక్తిగా పిలవాలని చెబుతాడు.ఆ హీరో మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ).

రాజమౌళి అప్పుడప్పుడు సరదాగా ప్రభాస్‌ను "ఏంటి రాజుగారు, ఏంటి సంగతులు?" అని అడుగుతాడట.

అప్పుడు "ఇదిగో జక్కన్న, మీరు ఇంకోసారి రాజుగారు అని పిలిస్తే బాగోదు" అని ప్రభాస్ సీరియస్ గానే రిప్లై ఇస్తాడట.

ప్రభాస్ క్షత్రియ కుటుంబంలో పుట్టిన సంగతి తెలిసిందే.అంతేకాదు ప్రభాస్ తన ఫ్రెండ్స్ లో ఎవరు ఏ కులం అనేది కూడా ఇప్పటివరకు తెలుసుకోలేదట.

అందరినీ సమానంగా చూసే హీరో ఇతను.అందుకే చాలామంది డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు.

ప్రభాస్ అందరికీ విందు భోజనం పెట్టిస్తాడు.అంత పెద్ద మనసు ఉంది కాబట్టే తెలుగులో ఏ హీరో అందుకో లేని స్థాయికి ఎదిగాడు.

బడా పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాడు.ప్రతి దర్శకుడికి ఫేవరెట్ హీరోగా కూడా నిలిచాడు.

ప్రభాస్ రీసెంట్ గానే కల్కి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. """/" / త్వరలో ఈ హీరో మారుతి( Maruthi)తో కలిసి హారర్ కామెడీ సినిమా అయిన "రాజా సాబ్‌( The Raja Saab )"తో పలకరించనున్నాడు.

సలార్ పార్ట్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇంకా ఈ హీరో చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి.

అవన్నీ కూడా భారీ బడ్జెట్ మూవీలు కావడం విశేషం.

జనాలను పిచ్చోళ్లను చేయొద్దు.. అలియా భట్ పై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!