రాజాం టికెట్ మ‌ళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకేనా.. ఎన్నిక‌ల నాటికి ఏమైనా జ‌ర‌గొచ్చు..!!

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎంత‌మందికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక‌ట్ ద‌క్కుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది.

వ‌ర్గ‌పోరు.పోటీ ఉండ‌టంతో కొంత‌మంది అసంతృప్తితో ఉన్నార‌ట‌.

ఈ సారి త‌మ‌కే ద‌క్కుతుంద‌నే హోప్ తో ఉన్నార‌ట‌.ఇక పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్ష‌న్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సీఎం జ‌గ‌న్ స‌ర్వేల ఆధారంగా సీటు ఇచ్చేది.ఇవ్వ‌నిది తేల్చేస్తున్నార‌ట‌.

ఇక వైసీపీ ఉత్తరాంధ్రాలో 2014 ఎన్నికల్లో 34 సీట్లకు గానూ కేవలం 9 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది.

అలా గెలిచిన వాటిలో రాజాం సీటు ఒకటి.ఎస్సీ రిజర్వుడ్ సీట్లో కంబాల జోగులు తొలిసారి నెగ్గి ఎమ్మెల్యే అయ్యారు.

2019 లో ఆయనే గెలిచారు.అయితే మూడో సారి హ్యాట్రిక్ కొట్టాల‌నుకుంటే అంతా ఈజీ కాదని అంటున్నారు.

మరో వైపు ఆయన్ని తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జ‌రుగుతోంది.

అయితే జోగులు స్పీడ్ పెద్దగా లేకపోవడంతో పాటు పార్టీ కూడా ఆయన పట్ల అసంతృప్తి ఉందనే వాద‌న వినిపిస్తోంది.

మ‌రోవైపు టీడీపీ బాగా పుంజుకుంది.కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావు అయితే రాజాం ని చుట్టేస్తున్నారు.

లోకేష్ వచ్చినపుడు రోడ్ షోకి విప‌రీత‌మైన జ‌నాల‌ను పోగేసిన‌ట్లు స‌మాచారం.ఇక మరో వైపు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కూడా ఇక్కడ టికెట్ కోరుకుంటోంది.

ఆమె కూడా తన జోరు చూపిస్తోంది.ఈసారి టీడీపీ గెలిచే సీట్లలో రాజాం కూడా ఉందని ఆ పార్టీ గట్టిగా చెబుతోంది.

ఈ నేపథ్యంలో జోగులుని ఈసారి మారుస్తార‌న్న టాక్ వినిపిస్తోంది. """/"/ అయితే ట్విస్ట్ ఏంటంటే.

జగన్ రాజాం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈసారి కూడా జోగులుని గెలిపించండి అని పిలుపునివ్వ‌డం విశేషం.

ఆయన్ని మళ్లీ ఎమ్మెల్యే చేసే బాధ్యత మీదే అంటూ జగన్ చెప్ప‌డంతో సీటు ఖాయం అని అంటున్నారు.

అలా అయితే ఆయనకు టికెట్ ఇస్తే పార్టీలో వ్యతిరేకత వ‌స్తుంద‌నే ప్రచారం కూడా జ‌రుగుతోంది.

మ‌రి జ‌గ‌న్ ఎలా భ‌రోసా ఇస్తున్నారంటే.పార్టీ అధిష్టానం వద్ద ఉన్న నివేదికల్లో జోగులే బెటర్ క్యాండిడేట్ అని భావిస్తున్నారేమో.

"""/"/ మ‌రో విష‌యం ఏంటంటే అయితే టీడీపీ హయాంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా జోగులు పార్టీని వీడలేదు.

జ‌గ‌న్ ఇది కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారేమో చూడాలి.అందుకే మ‌ళ్లీ జోగులుకు టికెట్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ని అంటున్నారు.

ఇప్పుడైతే జోగులును గెలిపించండ‌ని జ‌గ‌న్ చెప్పిన‌ప్ప‌ట‌కీ రేపు ఎన్నిక‌ల వేళ ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు.

 .

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలా.. క్యారెట్ తో చెక్ పెట్టండిలా!