రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాకు నిమిషాల్లోనే ఆమోదం... గెలుపు సంకేతాలు ఇవ్వ‌డానికేనా..?

రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాకు నిమిషాల్లోనే ఆమోదం… గెలుపు సంకేతాలు ఇవ్వ‌డానికేనా?

సాధార‌ణంగా ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రైనా రాజీనామా చేస్తే.అంత తొంద‌ర‌గా అమోదించ‌రు.

రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాకు నిమిషాల్లోనే ఆమోదం… గెలుపు సంకేతాలు ఇవ్వ‌డానికేనా?

ఆ వ్యక్తి రాజీనామా లేఖ పంపిన త‌ర్వాత చ‌ట్ట‌బ‌ద్దంగా అనుస‌రించాల్సిన నియ‌మాల‌ను పాటిస్తూ స‌ల‌హాలు సూచ‌ల‌న త‌ర్వాత కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు.

రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాకు నిమిషాల్లోనే ఆమోదం… గెలుపు సంకేతాలు ఇవ్వ‌డానికేనా?

ఇదంతా జ‌ర‌గ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.అయితే ఇటీవ‌ల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కేవలం ప‌దినిమిషాల్లోనే ఆమోదించ‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

స్పీకర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి చేతికి రాజీనామా పత్రాన్ని ఇవ్వటం.పది నిమిషాలకు కూడా కాకుండానే రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓకే చేస్తున్నట్లుగా నిర్ణయాన్ని తీసుకోవటం వెన‌క మ‌త‌లాబేంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మవుతోంది.

అందులో మొదటిది ఇంత త‌క్కువ టైమ్ లో రాజీనామాను ఓకే చేయటమా.? సాధారణంగా కొన్ని సున్నిత అంశాలకు సంబంధించి వచ్చే రాజీనామాల్ని తొందరపాటుతో అంగీకరించకుండా పరిస్థితుల్ని మదింపు చేసిన తర్వాతే రాజీనామాకు ఓకే చెబుతుంటారు.

కానీ రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ లో స్పీకర్ అంత త్వరగా ఓకే చెప్పేశారంటే.

దానికి సంబంధించిన అంశంపై ఆయనకు పూర్తి అవగాహనతో పాటు.ఆయనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం అయి ఉంటుందని చెబుతున్నారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల వ్యవధిలో స్పీకర్ ఆమోదించటంతో టీఆర్ఎస్ లో సంద‌డి క‌నిపిస్తోంది.

ఈ ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్న‌ట్లు అనిపిస్తోంది.

"""/"/ ఎలాగూ ఉప ఎన్నిక త‌ప్ప‌దు కాబ‌ట్టి త‌మ‌కు అనుకూలంగా ఉండేలా మ‌లుచుకోవ‌డాన‌కి ఎక్క‌వ టైమ్ తీసుకోకుండా ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న తపనతో కేసీఆర్ అండ్ కో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఎక్కువ టైమ్ తీసుకోకుండా తొంద‌ర‌గానే ఆమోదం తెలిపేలా ఓకే చెప్పించి ఉంటారంటున్నారు.

అయితే ప‌ది నిమిషాల్లోనే రాజీనామా ఆమోదం చేయించ‌డంతో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రి చూడాలి ఎవ‌రిని గెలుపు వ‌రిస్తుందో.

మంత్రులకు తప్పిన పెను ప్రమాదం!

మంత్రులకు తప్పిన పెను ప్రమాదం!