ప్రశ్నార్థకంగా రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం!
TeluguStop.com
మునుగోడు ఉప ఎన్నికల ప్రకటన వెలువడేంత వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వార్తా కాలమ్స్‌లో మారుమోగింది.
బీజేపీ తరపున పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రూ.
వందల కోట్లు ఖర్చు చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి గెలవలేకపోయారు.
రాజగోపాల్ రెడ్డి , స్థానిక పార్టీ నేతలు ఇద్దరూ బిజెపి నైతికంగా గెలిచిందని, టిఆర్ఎస్ గెలవడానికి ఫౌల్ గేమ్ ఆడిందని ఆరోపించారు.
ఏది ఏమైనా ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం బీజేపీకి నిరాశను కలిగించింది.
సాధరంణంగా బీజేపీ హైకమాండ్ గెలుపు గుర్రాలను మాత్రమే కాస్త విలువనిస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ రాడార్‌లో ఉంటారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
మరి భాజపా ఆయనకు పార్టీలో ఏదైనా పదవి ఇస్తుందో లేక వదిలేస్తుందో చూడాలి.
"""/"/
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో" తన ఇటీవలి ఎన్నికల ఓటమిపై స్పందిస్తూ.తనపై పోరాడేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తన వద్ద ఉన్న అస్త్ర శాస్త్రాలనుఉపయోగించిందని, చివరకు తాను నైతికంగా విజయం సాధించానని ఆయన స్పష్టం చేశారు.
ఈ షోలో సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత వరుసగా కించపరిచే వ్యాఖ్యలు చేశారు .రాజగోపాల్ రెడ్డి ఓటమి తర్వాత చాలా మంది నేతలు బీజేపీలో చేరడానికి వెనుకాడుతున్నట్లు తెలస్తుంది.
దాదాపు కాంగ్రెస్, టీఆర్ఎస్ నుండి 30 మంది బడా నేతలు బీజేపీలో చేరడానికి ప్రయత్నించారు, ఈ ఓటమితో వారందరూ పునరాలోచనలో పడ్డారు.
దూకుడు ఉన్న బీజేపీకి మునుగోడు ఓటమి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.దీంతొ పార్టీలో చేరే వారు తమ రాజకీయ జీవితం గురించి ఆలోచిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అన్ని చోట్ల గెలిచే అవకాశం లేదని భావిస్తున్నా వారు మరో ప్రత్యామ్నాయ వేదిక కోసం చూస్తున్నారు.
పగుళ్లను మాయం చేసి పాదాలను మృదువుగా మార్చే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు మీకోసం!