అర్థరాత్రి అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన రాజధాని బస్సు…!

సూర్యాపేట జిల్లా: సోమవారం అర్ధరాత్రి నేషనల్ హైవే 65 పై జిల్లా కేంద్రంలోని ఎఫ్.

సి.ఐ గోదాము ఎదురుగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ డిపోకు చెందిన రాజధాని బస్సు విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్న సమయంలో సూర్యాపేటకు చేరుకోగానే అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన బస్సు డ్రైవర్ ను చికిత్స నిమిత్తం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా జనరల్ హాస్పిటల్ కి తరలించారు.

మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.