స్టార్ కమెడియన్ అలీకి ఆ కమెడియన్ ఇన్స్ పిరేషనా.. అసలేమైందంటే?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకరైన అలీ కమెడియన్ గా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి.
పూరీ జగన్నాథ్, పవన్ కల్యాణ్ సినిమాలు అలీకి మంచి పేరును తెచ్చిపెట్టాయి.ఈ మధ్య కాలంలో అలీకి అవకాశాలు తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఎఫ్3 సినిమాలోని పాత్రతో అలీ మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ నటుడిగా అంతకంతకూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.
అయితే స్టార్ కమెడియన్ అయిన అలీకి ఇన్స్పిరేషన్ ఎవరనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు.
అలీకి ఇన్స్ పిరేషన్ ఎవరనే ప్రశ్నకు రాజబాబు పేరు సమాధానంగా వినిపిస్తోంది.ఒక కార్యక్రమంలో అలీ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
ఇండస్ట్రీలోని ఆర్టిస్టులలో చాలామంది ఇతరులు కష్టాల్లో ఉంటే తమ దగ్గర ఉన్న డబ్బును తీసి ఇచ్చేస్తారని అలీ కామెంట్లు చేశారు.
ఒకానొక సమయంలో రాజబాబు కష్టాల్లో ఉంటే ఆదుకున్నామని అలీ అన్నారు. """/" /రాజబాబు గారు ఇతరులకు సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి అని అలీ తెలిపారు.
పిల్లలు ఏది అడిగినా వెంటనే ఇచ్చే గుణాన్ని రాజబాబు కలిగి ఉన్నారని అలీ కామెంట్లు చేశారు.
ఒకసారి ఐదు సంవత్సరాల పిల్లాడు రాజబాబును రోడ్డుపై వెళ్లిన కారు కావాలని అడిగాడని రాజబాబు వెంటనే మూడు లక్షల రూపాయలు పెట్టి ఆ కారును కొనుగోలు చేసి ఇచ్చారని అలీ చెప్పుకొచ్చారు.
"""/" /
రాజబాబు చాలా గొప్ప ఆర్టిస్ట్ అని పిల్లలంటే రాజబాబుకు ఎంతో ప్రేమ అని అలీ తెలిపారు.
ప్రస్తుతం రాజబాబు కొడుకులు విదేశాలలో మల్టీ మిలియనీర్స్ గా ఉన్నారని అలీ చెప్పుకొచ్చారు.
అలీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా అలీకి విజయాలు దక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ ఇంటి చిట్కాను పాటిస్తే ఇక చుండ్రుతో దిగులే ఉండదు!